Site icon HashtagU Telugu

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. క్రేజీ కాంబినేషన్ ఫిక్స్!

Allu Arjun

Allu Arjun

పుష్ప (Pushpa) మూవీతో దేశవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). ఆ మూవీ సక్సెస్ తో బాలీవుడ్  ఆఫర్లు కూడా బన్నీకి వచ్చాయి. అయితే పుష్ప2తో బిజీగా ఉండటంతో షారుఖ్ తో నటించే అవకాశాన్ని సైతం వదులుకోవాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూట్ తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) ఏ మూవీ చేస్తారు? అనేది అటు అభిమానుల్లో, ఇటు టాలీవుడ్ లోనూ ఆసక్తి రేపింది. సస్పెన్స్ ను తెరదించుతూ ఐకాన్ స్టార్ అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ (Allu Arjun) బాలీవుడ్ నిర్మాతలతో సంప్రదింపులు జరిపాడు. ఈ వార్త అప్పట్లో బాగా వైరల్ అయి బన్నీ బాలీవుడ్ లో సినిమా చేస్తాడనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ దాని గురించి ఎలాంటి వార్తలు రాలేదు. తాజాగా నేడు ఉదయం అల్లు అర్జున్ సడెన్ గా సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మాణంలో సినిమా ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. టీ సిరీస్ ప్రొడక్షన్స్ మరియు భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్ కుమార్,  సందీప్ వంగ సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కలిసి నిర్మించనున్నారు. పాన్ ఇండియా సినిమాగా దీన్ని తెరకెక్కించనున్నారు.

ఈ సినిమా ప్రకటించడంతో బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సందీప్ వంగ (Sandeep Vanga) రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ స్పిరిట్ సినిమా ఉంది. మరి ఆ సినిమా తర్వాత బన్నీతో సినిమా చేస్తాడా లేదా ప్రభాస్ సినిమా ఆపి బన్నీతో ముందు చేస్తాడా చూడాలి. అల్లు అర్జున్ కూడా పుష్ప 2 సినిమా తర్వాత బోయపాటి కాంబోలో సినిమా ఉంది. ఆ సినిమా ఆపుతాడా లేక అది అయ్యాక చేస్తాడా అనేది చూడాలి.

Also Read: Thalaivar 170: జై భీమ్ దర్శకుడితో రజినీకాంత్ 170వ చిత్రం!