ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నారు. త్వరలో పుష్ప 2 తో రాబోతున్న అల్లు అర్జున్ సినిమాతో భారీ క్రేజ్ ని ఏర్పరచుకున్నారు. అల్లు అర్జున్ కి నేషనల్ లెవెల్ లో ఉన్న ఫాలోయింగ్ చూసి ప్రముఖ బ్రాండ్ లన్నీ కూడా ఆయన చెంతకు చేరుతున్నాయి. ఇప్పటికే చాలా వాటికి అల్లు అర్జున్ బ్రాండింగ్ చేస్తుండగా లేటెస్ట్ గా థమ్స్ అప్ తో కూడా పుష్ప రాజ్ డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది.
లీడింగ్ స్టార్స్ తోనే థమ్స్ అప్ కొలాబరేషన్ ఉంటుంది. అంతకుముందు చాలా కాలం థమ్స్ అప్ (Thums Up) కి మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. థమ్స్ అప్ అంటే మహేష్.. మహేష్ అంటే థమ్స్ అప్ అనిపించేలా చేశాడు. ఆ తర్వాత మహేష్ మౌంటెన్ డ్యూకి వెళ్లాడు. మహేష్ (Mahesh) తర్వాత ఆ ఛాన్స్ విజయ్ దేవరకొండ అందుకున్నాడు. మొన్నటిదాకా థమ్స్ అప్ కి విజయ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు.
గీతా ఆర్ట్స్ కాంపౌండ్..
ఇక ఇప్పుడు ఆ ఛాన్స్ అల్లు అర్జున్ కి వచ్చింది. త్వరలోనే అల్లు అర్జున్ థమ్స్ అప్ యాడ్ రాబోతుందని తెలుస్తుంది. అల్లు అర్జున్ థమ్స్ అప్ కొలాబరేషన్ గురించి గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నిర్మాత ఎస్.కె.ఎన్ తన ఎక్స్ లో అనౌన్స్ చేశారు. థండర్ స్ట్రైకింగ్ సూన్ అంటూ అల్లు అర్జున్ థమ్స్ అప్ యాడ్ గురించి చిన్న హింట్ ఇచ్చాడు ఎస్.కె.ఎన్.
ఇక పుష్ప 2 విషయానికి వస్తే డిసెంబర్ 5న సినిమా వరల్డ్ వైడ్ భారీగా రిలీజ్ చేయనున్నారు. రష్మిక మనందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీలని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.
Also Read : CM Revanth Padayatra: సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర.. షెడ్యూల్ ఇదే!