Allu Arjun : గత కొంతకాలంగా అల్లు అర్జున్ కి – మెగా ఫ్యామిలీకి మధ్య విబేధాలు ఉన్నాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ పవన్ కి వ్యతిరేకంగా నంద్యాలలో వైసీపీకి ప్రచారం చేయడంతో అభిమానులు, కార్యకర్తలు ఫైర్ అయ్యారు. అప్పట్నుంచి బన్నీ – మెగా ఫ్యాన్స్ వార్ సోషల్ మీడియాలో నడుస్తూనే ఉంది.
అల్లు అర్జున్ కూడా పలుమార్లు అందుకు తగ్గట్టే ప్రవర్తించాడు. ఆ ఘటన తర్వాత బన్నీ పవన్ కళ్యాణ్ ని ఇప్పటిదాకా కలవలేదు. అయితే తాజాగా నిన్న రాత్రి అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళాడట.
ఇటీవల పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో చిక్కుకొని గాయాలపాలయి చికిత్స తీసుకున్నాడు. చికిత్స అనంతరం కోలుకోవడంతో హైదరాబాద్ కి తీసుకొచ్చారు. ప్రస్తుతం మార్క్ శంకర్ హైదరాబాద్ లోని పవన్ ఇంట్లోనే ఉన్నాడు. దాంతో మార్క్ శంకర్ పరామర్శించడానికి అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డితో కలిసి పవన్ ఇంటికి నిన్న రాత్రి వెళ్లారట. మార్క్ శంకర్ ని పరామర్శించి, పవన్ తో మాట్లాడి కాసేపు ఉండి వచ్చేశారని అల్లు ఫ్యామిలీ సన్నిహితుల సమాచారం.
అయితే అధికారికంగా ఫోటోలు, వీడియోలు ఏమి రాలేదు. మరి దీనిపై ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. నంద్యాల ఘటన తర్వాత మొదటి సారి పవన్ ని ఇలా అల్లు అర్జున్ కలవడంపై సర్వత్రా చర్చగా మారింది.
Also Read : Nithin : నితిన్ వల్ల రూ.2 కోట్లు నష్టపోయాం – నిర్మాత ఆవేదన