Site icon HashtagU Telugu

Allu Arjun : అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇచ్చిన మెగా ప్రొడ్యూసర్

Allu Arjun

Allu Arjun

‘పుష్ప-2′(Pushpa 2)తో భారీ విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్(Allu Arjun) తన తర్వాతి సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) తో చేయబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కలయికలో జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి , అల వైకుంఠపురం లో వంటి మూడు సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాలు సాధించడమే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ కు బన్నీ ని దగ్గర చేసాయి.

New RTC Bus Stands : హైదరాబాద్‌లో కొత్త RTC బస్టాండ్లు..ఎక్కడెక్కడ అంటే..!!

ఈ సినిమా ఫై నిర్మాత బన్నీ వాసు అప్డేట్ అందించారు. ‘తండేల్’ ప్రమోషన్స్ లో భాగంగా బన్నీ వాసు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అల్లు అర్జున్ ప్రాజెక్ట్స్ డిస్కషన్స్ లో తాను కీలకంగా వ్యవహరిస్తానని , అయితే ఏ సినిమా చేయాలి.. ఎవరితో చేయాలి.. ఎలాంటి కథ చేయాలి అనే నిర్ణయం మాత్రం అల్లు అర్జునే తీసుకుంటారని తెలిపారు. ”అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాం. అధికారిక ప్రకటన రాకముందే ఈ మూవీ గురించి నేనేమీ మాట్లాడలేను. మార్చి నెలలో అనౌన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. సినిమా వివరాలు తెలియజేయడానికి ఒక స్పోక్స్ పర్సన్ ని హైర్ చేస్తున్నాం. ఊహాగానాలకు తావులేకుండా వారి ద్వారానే అన్ని విషయాలను ప్రాపర్ గా వెల్లడించాలని అనుకుంటున్నాం” అని బన్నీ వాసు చెప్పుకొచ్చారు.

ఇక తండేల్ విషయానికి వస్తే..

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో వస్తున్న చిత్రం తండేల్. ఈ సినిమాను చందు మొండేటి డైరెక్ట్ చేశారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా ఫిబ్రవరి 7న రిలీజ్ కు సిద్ధమైంది. ఇప్పటికే సాంగ్స్ , ట్రైలర్ ఇలా ప్రతిదీ సినిమాపై అంచనాలు పెంచేసాయి. చైతు కెరియర్ లో ఓ మైలు రాయి చిత్రంగా నిలువబోతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.