Site icon HashtagU Telugu

Posani Krishna Murali: బన్నీ ఇంటికి పిలిచి రూ.5 లక్షలు ఇచ్చాడు: పోసాని

Posani Krishna Murali

New Web Story Copy 2023 08 31t162433.911

Posani Krishna Murali: ఇటీవల కాలంలో నటుడు పోసాని కృష్ణమురళి ఎక్కువగా వార్తలు నిలుస్తున్నారు. రాజకీయ పరంగా, సినిమా పరంగా వివాదాస్పదంగా మారుతున్నారు. తాజాగా ఆయన అల్లు అర్జున్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ తనను ఇంటికి పిలిచి రూ.5 లక్షల చెక్కు ఇచ్చారని ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళి తెలిపారు. నిజానికి ఈ విషయాన్ని 2018లోనే చెప్పిన పోసాని.. ఇప్పుడు మరోసారి గుర్తు చేశారు. బుధవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన పోసాని కృష్ణమురళి.. అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ప్రెస్‌మీట్‌లో పోసాని నంది నాటకోత్సవం గురించి వివరిస్తుండగా అల్లు అర్జున్‌కి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రావడంపై మీ స్పందన ఏంటి సార్ అని ఓ విలేకరి ప్రశ్నించారు. దీనిపై పోసాని కృష్ణమురళి స్పందిస్తూ బన్నీతో తనకున్న అనుబంధాన్ని, అతని గొప్పతనాన్ని వివరించారు.

అల్లు అర్జున్ నాకు ఎప్పటి నుంచో బెస్ట్ ఫ్రెండ్. నేను సీనియర్‌ని అయినా నేనంటే ఆయనకు ఇష్టం. ఒకసారి నాకు ఫోన్ చేసి మురళి ఒకసారి మా ఇంటికి రావాలని.. టీ కి ఆహ్వానించాడు అని చెప్పాడు. బన్నీ కోరిక మేరకు నేను వెళ్ళాను.. టీ ఇచ్చి లోపల నుంచి కవర్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. చూస్తే రూ.5 లక్షల చెక్కు ఉంది. ఏం బాబూ చెక్కు ఇచ్చావు అని అడిగాను. నీ దగ్గరే ఉంచుకో అన్నాడు. నేను బాగానే ఉన్నాను.. బాగా సెటిల్ అయ్యాను.. ఎందుకు ఇస్తున్నావ్? అని అడిగాను. అప్పు అల్లు అర్జున్.. ఇష్టంతో ఇచ్చాను దయచేసి కాదనకండి ప్లీజ్ అంటూ నాకు ఇచ్చాడు అని పోసాని కృష్ణ మురళి గుర్తు చేసుకున్నాడు. .

ఆ చెక్కును తీసుకుని మంచి పనికి వాడుకున్నానని పోసాని వివరించారు. పదోతరగతి ఉత్తీర్ణత సాధించి, చదువుకునే స్థోమత లేక ఏదో ఒక పని చేస్తున్న పిల్లల గురించి ఖర్చు చేసానని పోసాని తెలిపారు. అయితే ఈ సాయం నేను చేయలేదు.. అల్లు అర్జున్ చేసాడు.. థాంక్స్ చెప్పాలని లైవ్ లో చెప్పాను అని పోసాని గుర్తు చేసుకున్నారు.

Also Read: Urvashi Rautela: ఒక నిమిషానికే కోటి రెమ్యూనరేషన్, పవన్ కు షాక్ ఇచ్చిన ఐటెం బ్యూటీ!