Site icon HashtagU Telugu

Allu Arjun : బన్నీ కోసం 1600 కిలోమీటర్లు సైకిల్ మీద వచ్చిన అభిమాని.. వెళ్ళేటప్పుడు ఫ్లైట్‌లో..

Allu Arjun fan comes from 1600km to meet him Video goes Viral

Allu Arjun

Allu Arjun : అల్లు అర్జున్ కి పుష్ప సినిమాతో నార్త్ లో కూడా భారీ ఫాలోయింగ్ వచ్చింది. అక్కడ కూడా బన్నీకి ఫ్యాన్స్ ఏర్పడగా పుష్ప 2 సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఓ అల్లు అర్జున్ అభిమాని ఏకంగా బన్నీని కలవడానికి 1600 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వచ్చాడు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అలీఘ‌డ్ కి చెందిన ఓ వ్యక్తి ఆల్మోస్ట్ 1600 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ అల్లు అర్జున్ ని కలవడానికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న బన్నీ అతన్ని పిలిపించి కలిసాడు. అంతదూరం నుంచి వచ్చి అల్లు అర్జున్ ని చూడగానే ఆ వ్యక్తి ఎమోషనల్ అయ్యాడు. బన్నీ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నాడు. బన్నీ అతన్ని అభినందించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే అల్లు అర్జున్ అతన్ని ఇంకోసారి ఇలా చేయకు అని వారించి వెళ్ళేటప్పుడు ఫ్లైట్ బుక్ చేయిస్తానని, సైకిల్ కూడా బస్సులో పార్సిల్ పంపిస్తానని అతనికి మాట ఇచ్చి అందుకు ఏర్పాట్లు చేయమని తన స్టాఫ్ కి చెప్పాడు. అలాగే అతనికి కొంత డబ్బు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. పుష్ప ప్రమోషన్స్ కి ఉత్తరప్రదేశ్ వస్తే కలుస్తానని చెప్పాడు. ఇలా నార్త్ నుంచి ఓ అభిమాని సైకిల్ మీద వచ్చి మరీ కలవడంతో అల్లు అర్జున్ మరోసారి నార్త్ లో కూడా వైరల్ అవుతున్నాడు.

 

Also Read : YouTube Features : యూట్యూబ్‌లో మరింత కంఫర్ట్‌గా ‘మినీ ప్లేయర్‌’.. ‘స్లీప్‌ టైమర్‌‌’ను వాడేసుకోండి