Site icon HashtagU Telugu

Allu Arjun : వాళ్ళ కోసం పది లక్షలు డొనేట్ చేసిన అల్లు అర్జున్..

Allu Arjun Donation to Telugu Film Director Association

Allu Arjun Donation to Telugu Film Director Association

Allu Arjun : అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2(Pushpa) షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. తాజాగా అల్లు అర్జున్ చేసిన మంచి పని వైరల్ అవుతుంది. ఇటీవల తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్(Telugu Film Director Association) కొత్తగా ఏర్పడిన కార్యవర్గం చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. మే 4న దాసరి నారాయణరావు జన్మదినం సందర్భంగా ప్రతి ఏటా డైరెక్టర్స్ డేని సింపుల్ గా జరుపుతారు. అయితే ఈ సారి 4న గ్రాండ్ గా చేద్దామనుకున్నా కొన్ని కారణాలతో వాయిదా వేశారు. LB స్టేడియంలో మే 19న తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరెక్టర్స్ డేని భారీగా నిర్వహించబోతున్నారు.

ఈ ఈవెంట్ కి సినీ పరిశ్రమ అంతా కదిలి రానుంది. ఇప్పటికే తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ చాలా మంది హీరో, హీరోయిన్స్, సినీ ప్రముఖులను స్వయంగా కలిసి ఆహ్వానించారు. తాజాగా అల్లు అర్జున్ ని కలిసి తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ మెంబర్స్ ఈ కార్యక్రమానికి హాజరవ్వాల్సిందిగా కోరారు. దీనికి బన్నీ సానుకూలంగా స్పందించాడు.

అలాగే తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కి సొంత భవనం కట్టాలని, మెంబర్స్ అందరికి హెల్త్ కేర్ ఉండాలని చూస్తుంది. దీంతో నిధులు సమీకరించడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కి డొనేషన్ ఇచ్చారు. ప్రభాస్ ఇటీవల 35 లక్షలు ప్రకటించారు. తాజాగా అల్లు అర్జున్ 10 లక్షలు తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కి డొనేట్ చేశారు. స్పాట్ లో అక్కడే అల్లు అర్జున్ 10 లక్షలు ఇవ్వడంతో తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఆయనకు ధన్యవాదాలు తెలిపి అభినందించారు. ఈ విషయం తెలిసి బన్నీ ఫ్యాన్స్ తమ హీరోని అభినందిస్తున్నారు.

 

Also Read : Kannappa : కన్నప్ప సెట్స్‌లోకి ప్రభాస్ ఎంట్రీ.. పోస్టర్ అదిరింది..