Site icon HashtagU Telugu

Allu Arjun : అల్లు అర్జున్ మళ్లీ అదే తప్పు..!

Allu Arjun Koratala Siva is on Cards

Allu Arjun Koratala Siva is on Cards

Allu Arjun పుష్ప 1 సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 తో త్వరలో రాబోతున్నాడు. ఐతే ఏపీ ఎలక్షన్స్ టైం లో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్ధి శిల్పా రవి కోసం ప్రచారానికి వెళ్లడంతో మెగా ఫ్యాన్స్ అంతా ఆ మ్యాటర్ సీరియస్ గా తీసుకున్నారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే అల్లు అర్జున్ మీద ఒక రేంజ్ లో ఎటాక్ చేస్తున్నారు. దానికి తగినట్టుగానే అల్లు ఫ్యాన్స్ సమాధానం ఇస్తున్నారు. ఐతే నిన్న మొన్నటిదాకా ఈ ఇష్యూ హాట్ టాపిక్ కాగా ఈమధ్యనే కాస్త సర్ధుకుందని అనిపించింది. ఐతే మళ్లీ సైలెంట్ గా ఉన్న మెగా ఫ్యాన్స్ (Mega Fans) ని తన కామెంట్స్ తో షాక్ రెచ్చగొట్టాడు అల్లు అర్జున్.

బుధవారం జరిగిన మారుతి నగర్ సుబ్రమణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్, సుకుమార్ గెస్ట్ గా వచ్చారు. ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ స్పీచ్ మరోసారి మెగా ఫ్యాన్స్ ని డిస్ట్రబ్ చేసింది. ఎవరైనా ఒక హీరోని చూసి స్టార్ అవుతారు. కానీ తాను మాత్రం ఫ్యాన్స్ ని చూసి హీరో అయ్యాను.. మీ అభిమానమే నన్ను ముందుకు నడిపిస్తుందని అన్నారు అల్లు అర్జున్. ఇక తనకు కావాల్సిన వారి కోసం ఎక్కడికైనా వళ్తాను ఎవరికైనా సపోర్ట్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చారు.

Also Read : Happy Birthday Megastar : వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్..!

ఐతే ఇది కేవలం మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమా గురించి చెప్పినట్టుగా లేదు. తను తన ఫ్రెండ్ రవి కోసం వెళ్తే మెగా ఫ్యాన్స్ చేసిన హంగామాకి మళ్లీ అల్లు అర్జున్ మార్క్ కౌంటర్ అన్నట్టు చెప్పుకుంటున్నారు. అంతేకాదు నిన్న ఓ పక్క చిరన్నీవి బర్త్ డే స్పెషల్ ఈవెంట్ జరిగినా సరే ఆ ప్రస్తావన తీసుకు రాకుండా అల్లు అర్జున్ స్పీచ్ ఇవ్వడం షాకింగ్ గా ఉంది.

బన్నీ స్పీచ్ విన్నప్పటి నుంచి మెగా, పవర్ ఫ్యాన్స్ మరింత ఫైర్ అవుతున్నారు. మెగా అభిమానుల అండదండలతోనే స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ ఇప్పుడు వారిని మర్చిపోయి తన ఫ్యాన్స్ అనుకుంటూ చెబుతున్నాడని అంటున్నారు. ఐతే ఈవెంట్ లో చిరుని విష్ చేయని అల్లు అర్జున్ లేటెస్ట్ గా తన ట్విట్టర్ లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి బర్త్ డే విసెష్ అందించారు.