అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో తెరకెక్కిన పుష్ప.. ది రూల్..ఎంతటి విజయం సాధించిందో తెలియంది కాదు. పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ నటనకు యావత్ అభిమానులే కాదు ప్రేక్షక లోకం జై జై లు కొట్టింది. తాజాగా ఈ నటనకు గాను జాతీయ అవార్డు సైతం దక్కింది. జాతీయ అవార్డు వచ్చిన సందర్బంగా పుష్ప రాజ్ టీం గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేస్తుంది.
తాజాగా శనివారం రాత్రి పుష్ప మేకర్స్ మైత్రి వారు గ్రాండ్ పార్టీ ఇచ్చారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ పార్టీలో టాలీవుడ్ దర్శక నిర్మాతలు సందడి చేశారు. అల్లు అర్జున్ (Allu Arjun) కేక్ కట్ చేయగా.. దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) లైవ్ సాంగ్స్‌తో అలరించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్‌గా మారాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్బంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ..”జీవితంలోని ప్రతి దశలో నేను ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటా. ఏదైనా గట్టిగా కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుందని సాధారణంగా మనం అనుకుంటాం. జాతీయ అవార్డు అందుకున్న తర్వాత నాకు తెలిసిన విషయం ఏమిటంటే.. మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్లు కూడా కోరుకుంటూనే ఏదైనా సరే జరుగుతుంది. జాతీయ అవార్డు అందుకోవాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా. కానీ, నాకు అవార్డు రావాలని సుకుమార్ మరెంతగానో కోరుకున్నారు. అందుకే నాకు ఈ అవార్డు వచ్చింది. ఆయనే అఛీవర్.. నేను కేవలం అఛీవ్‌మెంట్ మాత్రమే” అని అల్లు అర్జున్ తెలిపారు.
ప్రస్తుతం సీక్వెల్ పుష్ప ది రూల్ (Pushpa The Rule) షూటింగ్ బిజీగా ఉంది సుకుమార్ అండ్ బన్నీ టీం. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఫహద్ ఫాసిల్ జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Read Also : BJP Telangana Candidates List : బిజెపి ఫస్ట్ లిస్ట్ లో లేని ఆ కీలక నేతలు ఎవరంటే..!