Allu Arjun Birthday : మెగా ఫ్యామిలీ నుండి ఎంట్రీ.. ఐకాన్ స్టార్‌గా ఎదిగిన వైనం

నటనలో వైవిధ్యం చూపిస్తూ 'వేదం', 'జులాయి', 'అల వైకుంఠపురములో' వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్న అల్లు అర్జున్, 'పుష్ప: ది రైజ్' సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా అవతరించారు. ఈ చిత్రంలో ఆయన నటనకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు దక్కించుకోవడం

Published By: HashtagU Telugu Desk
Allu Arjun Bday

Allu Arjun Bday

పుష్పరాజ్ క్రేజ్‌తో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు (ఏప్రిల్ 8) ఈరోజు. ఈ సందర్బంగా ఆయనకు “hashtagu ” ప్రత్యేక బర్త్ డే విషెష్ అందిస్తుంది. మెగా కుటుంబం నుండి వచ్చినప్పటికీ, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసం అల్లు అర్జున్ చేసిన కృషి అమోఘం. ‘గంగోత్రి’ సినిమాతో వెండితెరకు పరిచయమైన బన్నీ, తొలి సినిమాతోనే నటుడిగా మంచి మార్కులు కొట్టేసారు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్య’ సినిమా ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. స్టైలిష్ స్టార్‌గా యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆయన, డ్యాన్స్‌లో తనదైన ముద్ర వేసి టాలీవుడ్‌లో బెస్ట్ డ్యాన్సర్‌లలో ఒకరిగా నిలిచారు.

‘పుష్ప’తో పాన్ ఇండియా మేనియా

నటనలో వైవిధ్యం చూపిస్తూ ‘వేదం’, ‘జులాయి’, ‘అల వైకుంఠపురములో’ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్న అల్లు అర్జున్, ‘పుష్ప: ది రైజ్’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా అవతరించారు. ఈ చిత్రంలో ఆయన నటనకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు దక్కించుకోవడం తెలుగు సినీ చరిత్రలోనే ఒక మైలురాయి. కేవలం సౌత్ ఇండియాలోనే కాకుండా, నార్త్ బెల్ట్‌లో కూడా అల్లు అర్జున్ మేనరిజమ్స్, డైలాగ్స్ ఒక ప్రభంజనాన్ని సృష్టించాయి.

బర్త్ డే ట్రీట్..

ఈ ఏడాది అల్లు అర్జున్ పుట్టినరోజు అభిమానులకు మరింత ప్రత్యేకం. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘పుష్ప-3’ సినిమా తో పాటు సెట్స్పైకి రాబోతున్న మరో రెండు సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. తగ్గేదే లే అంటూ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి సిద్ధమవుతున్న బన్నీకి అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వెండితెరపైనే కాకుండా నిజజీవితంలోనూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు హ్యాపీ బర్త్ డే!

  Last Updated: 08 Apr 2026, 08:46 AM IST