Allu Arjun : బన్నీ ఆ సినిమా చేస్తున్నప్పుడు చికెన్ తినకుండా ఉన్నాడట.. ఏ మూవీ తెలుసా?

2017 లో హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన సినిమా డీజే: దువ్వాడ జగన్నాధం. ఈ సినిమాలో బన్నీ మొదటిసారి బ్రాహ్మణుడి పాత్రలో కనిపించాడు.

Published By: HashtagU Telugu Desk
Allu Arjun avoid Non Veg for that Movie until completing shoot

Allu Arjun avoid Non Veg for that Movie until completing shoot

టాలీవుడ్(Tollywood) హీరో అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప(Pushpa) సినిమాతో పాన్ ఇండియా వైడ్ పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఆ సినిమాలో తన క్యారెక్టర్ కోసం ఎంత కష్టపడ్డాడో స్క్రీన్ పై తన నటన చూస్తే అర్ధమవుతుంది. నటుడిగా తనకి సినిమా పై ఉన్న ప్యాషన్.. నేడు తనని ఐకాన్ స్టార్ గా నిలబెట్టింది. అల్లు అర్జున్ తన సినిమాలోని పాత్రలు గురించి ఎంతో హోమ్ వర్క్ చేస్తాడు. ఆ పాత్ర కోసం తనని తాను మార్చుకోవడమే కాకుండా తన లైఫ్ స్టైల్ ని కూడా చేంజ్ చేసుకుంటాడు. అలా ఒక సినిమాలోని పాత్ర చేయడానికి ఆ మూవీ కంప్లీట్ అయ్యేవరకు చికెన్, నాన్ వెజ్ తినకుండా ఉన్నాడట.

2017 లో హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన సినిమా డీజే: దువ్వాడ జగన్నాధం. ఈ సినిమాలో బన్నీ మొదటిసారి బ్రాహ్మణుడి పాత్రలో కనిపించాడు. ఇక ఈ మూవీలో తన భాష యాస కోసం ఎంతో కష్టపడ్డాడు. బ్రాహ్మణులు శాకాహారులు కాబట్టి.. ఆ పాత్ర చేస్తున్న అల్లు అర్జున్ కూడా మాంసాహార జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడట. బ్రాహ్మణులకు గౌరవం ఇచ్చి.. ఆ ప్రాజెక్ట్ పూర్తి అయ్యే వరకు అల్లు అర్జున్ నాన్ వెజ్ ని దగ్గరకు కూడా రానివ్వలేదు. ఈ విషయాన్ని దర్శకుడు హరీష్ శంకర్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.

ఇక పుష్ప సినిమా విషయానికి వస్తే.. ఆ మూవీలో అల్లు అర్జున్ పాత్ర ఎత్తు బుజంతో కనిపిస్తుంది. సినిమా మొత్తం అలా బుజం పైకి ఎత్తి నటించడమే కాకుండా డాన్సులు కూడా వేసి అదరగొట్టేశాడు. అలాగే పుష్ప 2 చీర, గాజులు, బొట్టు పెట్టుకొని అమ్మోరు తల్లి గెటప్ లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఒక స్టార్ హీరో ఇమేజ్ ఉన్నా.. సినిమాలోని పాత్రకి న్యాయం చేయడానికి అల్లు అర్జున్ చూపించే డెడికేషన్ కి అతని ఫ్యాన్స్ తో పాటు ఇతర అభిమానులు కూడా శభాష్ అంటున్నారు.

 

Also Read : Krishna – Mahesh : కృష్ణ మహేశ్ బాబు కలిసి ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా?

  Last Updated: 31 May 2023, 08:32 PM IST