Allu Arha : నేడు వినాయక చవితి కావడంతో అందరూ వినాయకుని పూజలు చేస్తున్నారు. సెలబ్రిటీలు కూడా వారి వారి ఇళ్లల్లో వినాయక చవితి సెలబ్రేట్ చేసుకొని ఫొటోలు, వీడియోలు తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కూడా వినాయకచవితి స్పెషల్ గా చిన్ని వీడియో షేర్ చేసాడు.
అల్లు అర్జున్ కూతురు అర్హ పూజ మందిరంలో వినాయకుడికి పూజ చేస్తుండగా అక్కడ కూర్చుంది. పక్కనే అల్లు అర్జున్ తల్లి కూడా ఉన్నారు. ఈ వీడియో తన సోషల్ మీడియాలో షేర్ చేసి వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపాడు అల్లు అర్జున్. ఈ క్యూట్ వీడియోని ఫ్యాన్స్ షేర్ చేస్తూ అర్హని మెచ్చుకుంటున్నారు. ఇక అల్లు అర్జున్ భార్య అర్హ, అయాన్ ఇద్దరూ గీత ఆర్ట్స్ ఆఫీస్ లో వినాయకుడి దగ్గర కొబ్బరి కాయలు కొడుతున్న ఫొటోలు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది.
అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి రెగ్యులర్ గా అయాన్, అర్హ క్యూట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుందని తెలిసిందే. ఇవాళ పండగ పూట అల్లు అర్జున్ ఇలా వీడియో షేర్ చేయగా స్నేహ కూడా ఈ వీడియో షేర్ చేస్తూ ఫొటోలు కూడా షేర్ చేసింది. దీంతో ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
— Allu Arjun (@alluarjun) September 7, 2024
Also Read : Lavanya Tripathi : అత్తారింట్లో లావణ్య త్రిపాఠి వినాయకచవితి.. స్పెషల్ ఫొటోలు వైరల్..