Allu Aravind : పోలీసులను పోలీసులే చేజ్ చేస్తే.. వ్యవస్థని ఖండించే ప్రయత్నమే కోటబొమ్మాళి..!

Allu Aravind గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో తేజ మార్ని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కోటబొమ్మాళి పి.ఎస్. శుక్రవారం రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్

Published By: HashtagU Telugu Desk
Pushpa 2 Issue Allu Aravind Saviour Plan for Allu Arjun

Pushpa 2 Issue Allu Aravind Saviour Plan for Allu Arjun

Allu Aravind గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో తేజ మార్ని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కోటబొమ్మాళి పి.ఎస్. శుక్రవారం రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఈ సినిమా కథ వెరైటీగా ఉంటుందని అన్నారు. పోలీసులు క్రిమినల్స్ ని చేజ్ చేయడం చూస్తుంటాం కానీ ఈ సినిమాలో పోలీసులు పోలీసులనే చేజ్ చేస్తుంటారు.

ఇది ఎవరినో ఉద్దేశించి తీసిన సినిమా కాదు. దేశంలో ఇలాంటి వ్యవస్థని ఖండిస్తూ చేసిన సినిమా ఇది. సినిమాకు పనిచేసిన అందరు తమ బెస్ట్ ఎఫర్ట్ ఇచ్చారు. శ్రీకాంత్ ఎన్నో ఏళ్లుగా తమతో పనిచేస్తున్నారని అన్నారు అల్లు అరవింద్.

ఈ సినిమా ఇలాంటి టైం లో రావడం సినిమాకు కలిసి వస్తుందని అన్నారు. అసలైతే లాస్ట్ మంత్ రిలీజ్ అనుకున్నా కుదరలేదు. ఈ ఎలక్షన్ టైం లో రిలీజ్ అవ్వడం కూడా మంచి విషయమని అన్నారు. ఇక అందరు నిర్మాతలు హీరోలు, హీరోయిన్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు కానీ తాను నిర్మాతలను ఇంట్రడ్యూస్ చేస్తుంటానని అన్నారు. తన నుంచి ఇండస్ట్రీకి 10మంది నిర్మాతలను అందించాలని అన్నారు అల్లు అరవింద్.

కోటబొమ్మాళి పిఎస్ సినిమాలో శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాజి రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలుగా నటించారు.

Also Read : Vaishnav Tej : మెగా హీరో మాస్ అటెంప్ట్.. రిజల్ట్ ఎలా ఉంటుందో..?

We’re now on WhatsApp : Click to Join

  Last Updated: 21 Nov 2023, 11:51 AM IST