Site icon HashtagU Telugu

Tollywood : పవన్ హెచ్చరిక తో దెబ్బకు దిగొచ్చిన అల్లు అరవింద్

Allu Aravind

Allu Aravind

టాలీవుడ్‌లో ఇటీవల థియేటర్ల బంద్ (Theaters Bandh) వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. ఈ వ్యవహారం మీద ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పందిస్తూ విడుదల చేసిన లేఖతో పరిశ్రమలో పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా పవన్ విమర్శించినట్లుగా, పరిశ్రమ వర్గాలు ప్రభుత్వం పట్ల ఎలాంటి చొరవ తీసుకోలేదన్న ఆరోపణలపై ఇప్పుడు పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించి తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

Mahanadu 2025 : మహానాడు లో చంద్రబాబును ఆ వంటకాలను కోరిన మోడీ

ఈ సందర్భంగా అల్లు అరవింద్ తనపై వస్తున్న విమర్శల్ని ఖండించారు. గత పదిహేను సంవత్సరాలుగా పరిశ్రమపై ప్రభావం చూపుతున్న ‘ఆ నలుగురు’ గురించి వదంతులు వస్తున్నప్పటికీ తాను వారిలో లేనని స్పష్టంగా చెప్పారు. తాను ఏపీలో గల థియేటర్లకు ఓనర్ కాదని, కేవలం 15కి లోపే స్క్రీన్లు మాత్రమే లీజులో ఉన్నాయని, వీటినీ ఇకపై రెన్యువల్ చేయదలుచుకోలేదని తెలిపారు. పవన్ కళ్యాణ్ సినిమాకు విడుదల సమయంలో బంద్ పిలవడం అన్యాయమని అభిప్రాయపడ్డారు. పవన్ చేసిన సూచనల ప్రకారం చంద్రబాబును కలవాల్సిందని అంగీకరించారు.

అలాగే పవన్ విడుదల చేసిన లేఖలో ఉన్న అంశాలకు తాను పూర్తిగా మద్దతు ఉన్నానని అరవింద్ ప్రకటించారు. పరిశ్రమ సమస్యలను పరిష్కరించేందుకు సమాలోచన అవసరమని, అందుకే అప్పటి బంద్ నిర్ణయం సమయంలో తాను సమావేశాలకు దూరంగా ఉన్నానని వివరణ ఇచ్చారు. ఇకపై ‘ఆ నలుగురు’ అనే కథనాల్లో తన పేరు, ఫోటో చేర్చవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా మీట్ తర్వాత ఇతర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఏ విధంగా స్పందిస్తారో అన్న ఆసక్తికరమైన అంశం పరిశ్రమలో చర్చనీయాంశమైంది.