Site icon HashtagU Telugu

Bachhala Malli Glimpse : అల్లరి నరేష్ ‘బచ్చల మల్లి’ గ్లింప్స్ రిలీజ్.. ఎవడి కోసం తగ్గాలి? ఎందుకు తగ్గాలి?

Allari Naresh Birthday Special Baachhala Malli Movie Glimpse Released

Baachhala Malli

Bachhala Malli Glimpse : అల్ల‌రి న‌రేష్ సెకండ్ ఇన్నింగ్స్ లో తన కామెడీకి కొంచెం దూరంగా మాస్, కమర్షియల్, కంటెంట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. త్వరలో అల్లరి నరేష్ ‘బ‌చ్చ‌ల మ‌ల్లి’ అనే సినిమాతో రాబోతున్నాడు. సుబ్బు మంగాదేవి ద‌ర్శ‌క‌త్వంలో హాస్యా మూవీస్ బ్యానర్ పై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మాణంలో బచ్చల మల్లి సినిమా తెరకెక్కుతుంది.

గతంలో ఈ సినిమా నుంచి కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేసారు. ఇందులో అల్లరి నరేష్ మల్లి అనే ట్రాక్టర్ డ్రైవర్ పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా నేడు అల్లరి నరేష్ పుట్టిన రోజు కావడంతో బచ్చల మల్లి సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ వీడియోలో.. భగవద్గీత వినిపిస్తుంటే అల్లరి నరేష్ నిద్ర లేచి వచ్చి తన ఇంటి ముందు కట్టి ఉన్న లౌడ్ స్పీకర్ ని పడేస్తాడు. అలాగే వైన్ షాప్ లో తాగి ఫైట్ చేస్తాడు. ఎవడి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి అనే మాస్ డైలాగ్ తో, ఫైట్ తో అదరగొట్టాడు అల్లరి నరేష్.

ఈ సినిమాలో అల్లరి నరేష్ గెటప్ కూడా లుంగీ కట్టి, గడ్డం పెంచి ఫుల్ మాస్ గా కనపడబోతున్నాడు. దీంతో ఈ బర్త్ డే స్పెషల్ గ్లింప్స్ వైరల్ గా మారింది. మీరు కూడా బచ్చలమల్లి గ్లింప్స్ చూసేయండి..

 

Also Read : Jai Bolo Telangana Heroine : పెళ్లి చేసుకున్న ‘జై బోలో తెలంగాణ’ హీరోయిన్