Site icon HashtagU Telugu

Paris Fashion Week: పారిస్‌ ఫ్యాషన్​ వీక్​లో అలియా హొయలు

Paris Fashion Week

Paris Fashion Week

Paris Fashion Week: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో అరంగేట్రం చేసిన బాలీవుడ్ స్టార్ అలియా భట్ (Alia Bhatt), ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన డ్రెస్‌లో కనిపించింది. ప్యాలెస్ గార్నియర్‌లో వాక్ యువర్ వర్త్ షో సందర్భంగా నటి అమెరికన్ స్టార్ ఆండీ మెక్‌డోవెల్‌తో కలిసి రన్‌వేపై నడిచింది. ఆలియా డిజైనర్స్ కోచర్ కలెక్షన్ 2024 అరుణోడే నుండి బ్లాక్ వెల్వెట్ ఫ్లేర్డ్ ప్యాంట్‌తో మెటల్-కాస్ట్ సిల్వర్ బ్రెస్ట్‌ప్లేట్ ధరించింది. ఈ డ్రెస్ లో అలియా అందం మరింత పెరిగింది.

పారిస్ ఫ్యాషన్ వీక్ (Paris Fashion Week)లో ఆలియా భట్ తో పాటు ఐశ్వర్యారాయ్ బచ్చన్ తనదైన స్టైల్ తో ఆకట్టుకున్నారు. ఈ ఇద్దరూ ఈ ప్రతిష్టాత్మక ఫ్యాషన్ వీక్ లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు. అంతేకాదు పారిస్ ఫ్యాషన్ వీక్ లో ఇండియా తరఫున లోరియాల్ బ్రాండ్ అంబాసిడర్లుగా కనిపించారు. కాగా ఐష్ ఐదు పదుల వయసులోనూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ ఈవెంట్లో వీల్లిద్దరి డ్రెస్ లు ఆకట్టుకున్నాయి. వాస్తవానికి గుప్తా డిజైనర్ దుస్తులు ధరించిన ప్రముఖుల జాబితాలో బియాన్స్, ప్యారిస్ హిల్టన్, మిండీ కాలింగ్, ఏంజెలా బాసెట్, ప్రియాంక చోప్రా జోనాస్, కృతి సనన్, జాన్వీ కపూర్, కరీనా కపూర్ ఖాన్, షకీరా, జెన్నా ఒర్టెగా, జూనియర్ ఎన్టీఆర్, షార్బె స్తోన్, బెయోన్ రెక్స్ ఉన్నారు.

త్వరలో ఆలియా జిగ్రాలో కనిపించనుంది. దర్శకుడు వాసన్ బాలా దర్శకత్వం వహించిన జిగ్రా సినిమా టీజర్ పవర్ ప్యాక్డ్ సెటప్‌తో ఇంటర్నెట్‌ను పూర్తిగా షేక్ చేసింది. యాక్షన్ థ్రిల్లర్ చిత్రం రాజ్‌కుమార్ రావ్-త్రిప్తి డిమ్రీ నటించిన విక్కీ విద్యా కా వో వాలా వీడియోతో అక్టోబర్ 11, 2024న థియేటర్‌లలో విడుదల కానుంది. జిగ్రాలో వేదాంగ్ రైనా, మనోజ్ పహ్వా, రాహుల్ రవీంద్రన్ మరియు రాహుల్ నందా కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read: Ex IPS officer Vs Ex Army chief : మాజీ ఐపీఎస్ నాగేశ్వర రావు వర్సెస్ మాజీ ఆర్మీ చీఫ్.. ఆ ఘటనపై ట్వీట్ వార్