Alia Bhatt : రాజమౌళిని అలియా భట్ యాక్టింగ్ సలహా అడిగితే ఏం చెప్పాడో తెలుసా?

అలియా బాలీవుడ్ సినిమాలు చేస్తూనే RRR సినిమాలో సీత పాత్రలో నటించి మెప్పించింది. తాజాగా మీడియాతో మాట్లాడుతూ రాజమౌళిని పొగడ్తలతో ముంచేసింది.

Published By: HashtagU Telugu Desk
Alia Bhatt shares Interesting talks about Rajamouli

Alia Bhatt shares Interesting talks about Rajamouli

బాలీవుడ్(Bollywood) స్టార్ హీరోయిన్ అలియాభట్(Alia Bhatt) పాప పుట్టడంతో గత కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉంది. త్వరలోనే మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీగా ఉంది అలియా. బాలీవుడ్ సినిమాలు చేస్తూనే RRR సినిమాలో సీత పాత్రలో నటించి మెప్పించింది. తాజాగా మీడియాతో మాట్లాడుతూ రాజమౌళిని(Rajamouli) పొగడ్తలతో ముంచేసింది.

టైమ్స్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులైన ప్రముఖుల లిస్ట్ రిలీజ్ చేయగా అందులో ఇండియా నుంచి రాజమౌళి, షారుఖ్ మాత్రమే చోటు సంపాదించారు. మొట్టమొదటి సారి ఓ ఇండియన్ డైరెక్టర్, అదికూడా తెలుగు డైరెక్టర్ టైమ్స్ వరల్డ్ టాప్ 100 లిస్ట్ లో చోటు సంపాదించడంతో అందరూ రాజమౌళిని అభినందిస్తున్నారు.

ఇదే విషయంపై అలియాభట్ మీడియాతో మాట్లాడుతూ.. రాజమౌళి గారికి ఈ లిస్ట్ లో చోటు రావడం చాలా సంతోషంగా ఉంది. నేను మొదటి సారి రాజమౌళిని బాహుబలి ప్రీమియర్ సమయంలో కలిశాను. ఆ సినిమా నాకు బాగా నచ్చింది. ఇలాంటి డైరెక్టర్ తో వర్క్ చేయాలని అప్పుడు అనుకున్నాను. ఆ తర్వాత RRR సినిమాతో నా కల నెరవేరింది. ఆయన్ని నేను మాస్టర్ స్టోరీ టెల్లర్ అని పిలుస్తాను. ఆయన ఒక స్కూల్ లాంటివాడు. రోజూ ఆయన సినిమా షూటింగ్ కి వెళ్తే ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అని తెలిపింది.

అలాగే రాజమౌళి ని యాక్టింగ్ గురించి ఏదైనా సలహా ఇమ్మని అలియా అడిగితే.. నీకు నచ్చిన సినిమాని, అందులో క్యారెక్టర్ ని ప్రేమతో చెయ్యి. సినిమా ఫెయిల్ అయినా నీ క్యారెక్టర్ ప్రేక్షకులకు గుర్తుండిపోతుందని చెప్పారంట. దీంతో అలియా రాజమౌళిపై చేసిన పొగడ్తలు వైరల్ గా మారాయి.

 

Also Read :   Director Raj : ‘మల్లేశం’ డైరెక్టర్ బాలీవుడ్ లో సినిమా.. సైలెంట్ గా సినిమా కంప్లీట్ చేసేశాడుగా..

  Last Updated: 14 Apr 2023, 08:56 PM IST