అక్షయ్‌కుమార్, టైగర్‌ష్రాఫ్ నటిస్తున్న ‘చోటే మియా బడే మియా’ చిత్ర మేకప్ మ్యాన్ శ్రవణ్ విశ్వకర్మపై చిరుతపులి దాడి (Leopard Attacked) చేసింది. 27 సంవత్సరాల శ్రవణ్ విశ్వకర్మ ముంబై ఫిల్మ్ సిటీలో ఫ్రెండ్‌ను షూటింగ్ స్పాట్ నుంచి డ్రాప్ చేసేందుకు వెళ్లాడు. అప్పుడు బైక్ మీద చిరుత పులి దాడి చేసింది. ప్రస్తుతం శ్రవణ్‌కు ప్రొడక్షన్ హౌసే ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు సమాచారం.
అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న ‘బడే మియాన్ చోటే మియాన్’ సినిమా సెట్ నుండి హృదయ విదారకమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. సినిమాలో వర్క్ చేస్తున్న మేకప్ ఆర్టిస్ట్‌పై చిరుతపులి దాడి చేసి గాయపరిచింది. చిరుతపులి దాడిలో గాయపడిన మేకప్ ఆర్టిస్ట్ ఆస్పత్రిలో చేరారు. ఒక న్యూస్ పోర్టల్‌లోని కథనం ప్రకారం.. మేకప్ ఆర్టిస్ట్ శ్రవణ్ విశ్వకర్మ తన బైక్‌పై ఉన్నాడు. షూట్ నుండి తన స్నేహితుడిని డ్రాప్ చేయడానికి వెళ్లాడు. అతని బైక్ పై దారిలో చిరుతపులి దాడి చేసింది. గాయపడిన మేకప్ ఆర్టిస్ట్ చికిత్స ఖర్చులను ప్రొడక్షన్ హౌస్ వారే భరిస్తున్నట్లు సమాచారం.
ఓ నివేదిక ప్రకారం.. గాయపడిన మేకప్ ఆర్టిస్ట్ తన స్నేహితుడిని బైక్ నుండి దింపడానికి వచ్చానని చెప్పాడు. అతను షూటింగ్ లొకేషన్‌కు కొంచెం ముందుంటే ఓ పంది రోడ్డు దాటుతోంది. వెంటనే బయలుదేరాలి అనుకున్నాడు. అయితే బైక్‌ను స్పీడ్ పెంచిన వెంటనే ఓ చిరుతపులి పందిని వెంబడిస్తూ రావడం కనిపించింది. ఈ క్రమంలో ఆయన బైక్‌ను చిరుతపులి ఢీకొట్టి దాడి చేసింది.
Also Read: Nag-Naresh Multistarrer: టాలీవుడ్ లో మరో మల్టీస్టారర్.. నాగ్ తో అల్లరి నరేష్ మూవీ!
నివేదిక ప్రకారం.. అదే సమయంలో ఆల్ ఇండియా సినీ వర్కర్స్ (AICWA) అధ్యక్షుడు సురేష్ శ్యామ్‌లాల్.. రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆలిండియా సినీ వర్కర్స్ ప్రెసిడెంట్‌గా ఫిల్మ్‌సిటీలో వేల సంఖ్యలో షూటింగ్‌లు జరుగుతాయని, అలాంటప్పుడు తరచూ చిరుతపులుల బెడద నుంచి భద్రతకు ఎవరు హామీ ఇస్తారని ఆయన అన్నారు. ముంబైలోని ఫిల్మ్ సిటీని 300 ఎకరాల్లో నిర్మించారు. రాత్రిపూట అక్కడికి వెళితే వీధి దీపాల సౌకర్యం కూడా లేదని ఆయన వెల్లడించారు. వెలుతురు లేకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘బడే మియా చోటే మియా’.