Site icon HashtagU Telugu

Akshara Gowda : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ అక్షర గౌడ

Akshara Gowda Baby

Akshara Gowda Baby

ప్రముఖ హీరోయిన్ అక్షర గౌడ (Akshara Gowda) పండంటి బిడ్డకు (Blessing Baby) జన్మనిచ్చింది. చిన్నారి ఫొటో షేర్ చేసి నవమాసాలు గడిచిన రోజులను గుర్తుచేసుకుంది. అక్షర గౌడ తెలుగులో నటించిన సినిమాలు తక్కువే. కానీ ‘ది వారియర్’ మూవీలో విలన్ ఆది పినిశెట్టి భార్యగా నటించి మంచి పేరు తెచ్చుకుంది. 2019 లో వచ్చిన నాగార్జున ‘మన్మథుడు 2’ చిత్రంలో బోల్డ్ రోల్ లో నటించి కాసేపు ఆకర్షించింది కానీ ఆ సినిమా ఈమెకు కలిసిరాలేదు. ‘దాస్ క ధమ్కీ’ సినిమాలో మేనేజర్ గా హీరో అండ్ టీంని ఇబ్బంది పెట్టే అమ్మాయిగా ఈమె నటించింది. ఇలా సినిమాల పరంగా కలిసిరాకపోయేసరికి పెళ్లి చేసుకొని ఓ ఇంటిది అయ్యింది.

తాజాగా ఈమె పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. తన బేబీ కి సంబందించిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేసింది. అయితే తనకి పుట్టింది పాపో, బాబో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తన బిడ్డ ఫోటోలను షేర్ చేసి 9 నెలల ఆ అద్భుతమైన రోజులను గుర్తుచేసుకుంది.” తల్లి డ్యూటీ చేస్తూ.. ఎన్నో కోరికలను కోరుతూ 2024వ సంవత్సరాన్ని ముగిస్తున్నాము. తనకి బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చాను. 9 నెలలు నా కడుపులో మోసి.. అచ్చం తనలాగే ఉండే ఒక బేబీ ని గిఫ్ట్ గా ఇచ్చాను” అని ఆ పోస్ట్ లో పేర్కొంది. దీంతో ఆమె చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇంత ఎమోషనల్ అవుతూ పోస్ట్ పెట్టినప్పటికీ తనకి పుట్టింది ఎవరన్నది క్లారిటీ ఇవ్వకపోవడంతో పుట్టింది పాపా , బాబా అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Read Also : TTD: టీటీడీ కీలక నిర్ణయం.. ఆ దాతలకు వీఐపీ బ్రేక్‌ దర్శనం