Site icon HashtagU Telugu

Naga Chaitanya : నాగచైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ ‘దూత’ రిలీజ్ ఎప్పుడో తెలుసా? ఏ ఓటీటీలో?

Akkineni Naga Chaitanya Vikram K Kumar First web Series Dhootha Release Date Announced

Akkineni Naga Chaitanya Vikram K Kumar First web Series Dhootha Release Date Announced

 

ఇటీవల స్టార్ హీరోలు, హీరోయిన్స్ అంతా కూడా ఓటీటీల్లో(OTT) వెబ్ సిరీస్(Web Series) లు చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్(Tollywood) లోనే చాలామంది ఇప్పటికే వెబ్ సిరీస్ లు చేశారు. ఇప్పుడు వారిలో అక్కినేని నాగచైతన్య కూడా చేరాడు. నాగచైతన్య(Naga Chaitanya) చివరగా కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా విమర్శకులని మెప్పించినా కమర్షియల్ గా మాత్రం వర్క్ అవ్వలేదు.

త్వరలో నాగచైతన్య నెక్స్ట్ సినిమా చందూ మొండేటి దర్శకత్వంలో సాయి పల్లవి జంటగా చేయబోతున్నాడు. ఈ లోపు ఒక మంచి థ్రిల్లర్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు చైతు. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య మెయిన్ లీడ్ లో గత సంవత్సరం ‘దూత'(Dhootha) అనే వెబ్ సిరీస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ సిరీస్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సైలెంట్ గా పూర్తి చేసుకొని ఎలాంటి హడావిడి లేకుండా డైరెక్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. నాగ చైతన్య మొదటి వెబ్ సిరీస్ దూత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో డిసెంబర్ 1 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా దూత వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవ్వనుంది.

ఇక ఈ సిరీస్ లో పార్వతి, ప్రియా భవాని శంకర్, ప్రాచి దేశాయ్ ఫిమేల్ లీడ్స్ లో నటించారు. చైతన్య మొదటి సిరీస్ కావడం, థ్రిల్లర్ సిరీస్ కావడంతో అక్కినేని అభిమానులు దూత సిరీస్ కోసం ఎదురుచూస్తున్నారు. రిలీజ్ డేట్ అనౌన్స్ తో పాటు ఓ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ సిరీస్ కి సంబంధించి ప్రమోషన్స్ మొదలుపెడతారని సమాచారం.

 

Also Read : Vishwak Sen : విశ్వక్ సేన్‌కి షూటింగ్ లో ప్రమాదం జరిగిందా? లారీ మీద నుంచి కింద పడి..