అక్కినేని అఖిల్(Akkineni Akhil).. కెరీర్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క సూపర్ హిట్ కూడా కొట్టలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్(Most Eligible Bachelor) మాత్రం పర్వాలేదనిపించే విజయం సాధించింది. ఇక ఇటీవల వచ్చిన ఏజెంట్(Agent) సినిమా భారీ పరాజయం చూసింది. అనిల్ సుంకర(Anil Sunkara) నిర్మాణంలో సురేందర్ రెడ్డి(Surendar Reddy) దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో అఖిల్ హీరోగా, సాక్షి వైద్య హీరోయిన్ గా, మమ్ముట్టి ముఖ్య పాత్రలో ఏజెంట్ సినిమా తెరకెక్కింది.
సినిమా రిలీజ్ రోజే భారీ ఫ్లాప్ టాక్ తెచ్చుకొని అభిమానుల్ని చాలా నిరాశపరిచింది ఈ సినిమా. అఖిల్ కి మార్కెట్ లేకపోయినా ఈ సినిమాకు దాదాపు 60 కోట్ల బడ్జెట్ పెట్టి భారీ నష్టం చూశారు. అయితే ఈ సినిమా తర్వాత అఖిల్ నెక్స్ట్ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇంత భారీ ఫ్లాప్ చూశాక ఏదన్నా తక్కువ బడ్జెట్ లో సింపుల్ స్టోరీతో వస్తాడేమో అని పలువురు భావించారు.
కానీ అఖిల్ నెక్స్ట్ సినిమాపై ఓ ఇంటరెస్టింగ్ టాక్ వినిపిస్తుంది. అఖిల్ నెక్స్ట్ సినిమాను UV క్రియేషన్స్ లో కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకు కూడా దాదాపు 50 కోట్లు పెడుతున్నారని టాలీవుడ్ లో టాక్ నటిస్తుంది. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా తెచ్చి పాన్ ఇండియా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. అఖిల్ నెక్స్ట్ సినిమాకు ‘ధీర’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. దీంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. మార్కెట్ లేకపోయినా, ఆల్రెడీ భారీ ఫ్లాప్ చూసినా మళ్ళీ భారీ బడ్జెట్ సినిమా అవసరమా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి ఈసారి అయినా అఖిల్ హిట్ కొడతాడేమో?
Also Read : Karthika Deepam 2 : కార్తీక దీపం సీరియల్ సీక్వెల్ ఉందా? డాక్టర్ బాబు ఏమన్నాడు?