Site icon HashtagU Telugu

Akkineni Akhil : సలార్ 2 లో అఖిల్.. ఆ సింబాలిక్ గానే అక్కడ కనిపించాడా..?

Akkineni Akhil In Prabhas Salaar 2

Akkineni Akhil In Prabhas Salaar 2

Akkineni Akhil ప్రభాస్ సలార్ సినిమా 2023 డిసెంబర్ 22న రిలీజై మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రభాస్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో ఆదిపురుష్ అంటూ వచ్చి డిజాస్టర్ అందుకున్నాడు. అయితే ఆ సినిమా తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా సలార్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. సలార్ 1 సినిమా ప్రశాంత్ వర్మ మార్క్ మూవీగా వచ్చింది. సినిమాలో ప్రభాస్ తో ఈక్వల్ రోల్ లో పృధ్విరాజ్ నటించాడు. సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ అందించగా రెగ్యులర్ ఆడియన్స్ కూడా పర్వాలేదు అనేశారు.

We’re now on WhatsApp : Click to Join

సలార్ 1 సినిమా సక్సెస్ సందర్భంగా ఈమధ్యనే ప్రభాస్ అండ్ టీం ఒక ప్రైవేట్ పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో ప్ర్భాస్ తో పాటు మరే ఇతర హీరో పాల్గొనలేదు కానీ అక్కినేని యువ హీరో అఖిల్ పాల్గొన్నాడు. ప్రభాస్ సలార్ సినిమాకు అఖిల్ కి సంబంధం ఏంటి అసలు అఖిల్ సలార్ సక్సెస్ పార్టీలో ఎందుకు కనిపించాడని డౌట్లు మొదలయ్యాయి. ఇక కొందరు సలార్ లో అఖిల్ భాగమవుతున్నాడని అంటున్నారు.

సలార్ 2 లో అఖిల్ ఉన్నాడని అందుకే ప్రభాస్ సలార్ సినిమా సక్సెస్ పార్టీలో అఖిల్ కనిపించాడని అంటున్నారు. అయితే ఈ వార్తలపై చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు కానీ సలార్ టీం తో అఖిల్ ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సలార్ లో అఖిల్ ఈ ఊహే అదిరిపోయింది. ఎలాగు రూమర్ వచ్చింది కదా ఎక్కడో ఒక చోట అఖిల్ ని ఇరికిస్తే బెటర్ కదా అని అనుకుంటున్నారు ఆడియన్స్.

Also Read : Anjali: బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది: హీరోయిన్ అంజ‌లి

రెబల్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు అక్కినేని ఫ్యాన్స్ కి కూడా సలార్ లో అఖిల్ అంటే సంతోషపడుతున్నారు. ఏజెంట్ సినిమా తర్వాత అఖిల్ తన నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేయలేదు. యువి వాళ్లతోనే ఒక సినిమా ఉంటుందని తెలుస్తున్నా అది కూడా సెట్స్ మీదకు వెళ్లలేదు. మరి అఖిల్ సలార్ ఈవెంట్ కి ఎందుకొచ్చాడో తెలియదు కానీ అఖిల్ రాకతో సలార్ 2లో అతను ఉన్నాడని వార్తలు మాత్రం హైలెట్ అవుతున్నాయి.

ప్రశాంత్ నీల్ ఈ ఆలోచన ఏదో బాగుందని ప్రభాస్ సలార్ 2లో అఖిల్ ని తీసుకుంటే బెటర్ అని అంటున్నారు ఆడియన్స్. సలార్ 1 2023 డిసెంబర్ లో రిలీజ్ కాగా 2025 సెకండ్ హాఫ్ లో సలార్ 2 రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సలార్ 2 కోసం మరో ఆరు నెలలు ప్రభాస్ డేట్స్ ఇవ్వాల్సి ఉందని తెలుస్తుంది.

Exit mobile version