Site icon HashtagU Telugu

Akhil : అఖిల్ పెద్ద ప్లానింగ్ లో భాగంగానే..!

Akhil New Movie

Akhil New Movie

అక్కినేని అఖిల్ ఏజెంట్ (Akhil Agent) సినిమా వచ్చి ఏడాది పైన అవుతున్నా తన నెక్స్ట్ సినిమా ఏంటన్నది ఇప్పటివరకు చెప్పలేదు. అఖిల్ సినిమా గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు రావడమే తప్ప సినిమా మొదలైంది లేదు. నూతన దర్శకుడితో అఖిల్ సినిమా ఉంటుందన్న టాక్ ఉంది కానీ రోజులు గడుస్తున్నా కూడా సినిమా గురించి మాత్రం చెప్పట్లేదు.

ఐతే అఖిల్ పెద్ద ప్లానింగ్ లో భాగంగానే ఇలా లేట్ చేస్తున్నాడని అంటున్నారు. అఖిల్ నెక్స్ట్ సినిమా ఒక పీరియాడికల్ మూవీ (Periodical Movie)గా వస్తుందని తెలుస్తుంది. బడ్జెట్ కూడా భారీగానే పెట్టాలని ఫిక్స్ అయ్యారట. అఖిల్ కోసం ఒక అద్భుతమైన కథని లాక్ చేశారని సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని అంటున్నారు.

ఈ సినిమా కోసమే అఖిల్ తన మేకోవర్ (Akhil Makeover) చేస్తున్నాడని. లాంగ్ హెయిర్ ఈ సినిమా కోసమే అఖిల్ సిద్ధం చేస్తున్నాడని తెలుస్తుంది. అఖిల్ భారీ స్కెచ్ తోనే ఇలా టైం తీసుకుంటున్నాడని. సినిమా అనౌన్స్ మెంట్ తోనే ఈసారి సూపర్ బజ్ తెచ్చుకుంటాడని అంటున్నారు. ఐతే అఖిల్ సినిమా అనౌన్స్ మెంట్.. కాస్ట్ అండ్ క్రూ డీటైల్స్ ఇప్పటికే ఫైనల్ కాగా మంచి ముహుర్తం చూసి అది రివీల్ చేస్తారని టాక్.

అఖిల్ మాత్రం తన 6వ సినిమాతో చాలా భారీ ప్లానింగ్ తోనే రాబోతున్నాడని తెలుస్తుంది. ఏజెంట్ తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్నా సూపర్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది. అఖిల్ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఐతే వారి రిక్వెస్టులు వింటున్నా అఖిల్ మంచి టైం చూసుకుని సినిమా ప్రకటిస్తాడని తెలుస్తుంది. ఐతే అయ్యగారి సినిమా అనౌన్స్ మెంట్ రోజు దాకా అక్కినేని ఫ్యాన్స్ మాత్రం వెయిట్ చేయాల్సిందే అని అంటున్నారు.

Also Read : NTR : దేవర ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతున్న అతను..?

Exit mobile version