Akhil New Look : అఖిల్ న్యూ లుక్ చూశారా.. వామ్మో అయ్యగారు ఏందయ్యా ఇది..!

Akhil New Look అక్కినేని అఖిల్ ఏజెంట్ తర్వాత మరో సినిమా మొదలు పెట్టలేదు. సురేందర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆ సినిమాను ఏకె ఎంటర్టైన్మెంట్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. కానీ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

Published By: HashtagU Telugu Desk
Akhil New Look Goes Viral On Social Media

Akhil New Look Goes Viral On Social Media

Akhil New Look అక్కినేని అఖిల్ ఏజెంట్ తర్వాత మరో సినిమా మొదలు పెట్టలేదు. సురేందర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆ సినిమాను ఏకె ఎంటర్టైన్మెంట్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. కానీ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ సినిమా ఫెయిల్యూర్ ని జీర్ణించుకోలేని అఖిల్ కొన్నాళ్లు ఫారిన్ వెళ్లి అక్కడ రిలాక్స్ అయ్యాడు. అఖిల్ నెక్స్ట్ సినిమాపై రకరకాల వార్తలు వస్తున్నా వాటిలో ఏది నిజమన్నది చెప్పడం కష్టంగానే ఉంది.

రీసెంట్ గా అఖిల్ సలార్ పార్టీ లో కనిపించే సరికి సలార్ 2 లో దేవా తమ్ముడిగా అఖిల్ నటిస్తున్నాడని ఒకటే హడావిడి చేశారు. అయితే అఖిల్ సలార్ లో నటించే ఛాన్సే లేదని తెలుస్తుంది. సలార్ నిర్మాతలు హోంబలె ప్రొడక్షన్స్ లో అఖిల్ సినిమా చేస్తున్న కారణంగా సలార్ పార్టీలో అఖిల్ అటెండ్ అయ్యాడని చెప్పుకొచ్చారు.

కొత్త దర్శకుడితో అఖిల్ పీరియాడికల్ మూవీ ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా గురించి అఫీషియల్ అప్డేట్స్ రావాల్సి ఉంది. అయితే లేటెస్ట్ గా అఖిల్ లుక్ ఒకటి బయటకు వచ్చింది. ఫ్రెండ్ తో దిగిన అఖిల్ ఫోటో చూస్తే డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. గుబురు గడ్డంతో అఖిల్ మేకోవర్ తన నెక్స్ట్ సినిమా కోసమేనా అని అంటున్నారు. ఏది ఏమైనా అయ్య గారి లుక్ అక్కినేని ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తుందని తెలుస్తుంది.

Also Read : Sai Dharam Tej : ఆ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్.. మెగా మేనల్లుడి ప్లాన్ అదుర్స్..!

  Last Updated: 23 Feb 2024, 08:49 PM IST