Site icon HashtagU Telugu

Akhil : సలార్ సక్సెస్ పార్టీలో అఖిల్ ఎందుకు.. అసలు స్టోరీ ఇది.. హోంబలె తో అఖిల్ మూవీ డైరెక్టర్ కూడా..!

Akhil New Movie

Akhil New Movie

Akhil ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్ సినిమాను హోంబలే ప్రొడక్షన్స్ బ్యానర్ లో విజయ్ కిరగండూర్ నిర్మించారు. అంతకుముందు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన కె.జి.ఎఫ్ ను కూడా ఇదే నిర్మాత ప్రొడ్యూస్ చేశారు.

సలార్ 1 తో సెన్సేషనల్ హిట్ అందుకోగా ఆ తర్వాత చిత్ర యూనిట్ సమక్షంలో సక్సెస్ పార్టీ జరిగింది. అయితే కేవలం సినిమాకు సంబందించిన వారు అటెండ్ అయిన ఈ పార్టీలో అక్కినేని యువ హీరో అఖిల్ కూడా పాల్గొన్నాడు. అఖిల్ సలార్ సక్సెస్ పార్టీలో పాల్గొనడంపై రకరకాల వార్తలు వచ్చాయి.

We’re now on WhatsApp : Click to Join

సలార్ 2 లో అఖిల్ నటిస్తున్నాడని అందుకే అఖిల్ ఈ టీం తో కలిసి పార్టీ చేసుకున్నాడని అన్నారు. కానీ అఖిల్ ఆ పార్టీలో పాల్గొన్న రీజన్ లేటెస్ట్ గా బయటకు వచ్చింది. అఖిల్ నెక్స్ట్ సినిమా హోంబలె బ్యానర్ లో చేస్తున్నాడట. అనీల్ కుమార్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమాను యువి క్రియేషన్స్ కూడా భాగస్వామ్యం అవుతున్నారు. ఈ సినిమా చర్చల్లో భాగంగానే అఖిల్ సలార్ పార్టీలో కనిపించాడని తెలుస్తుంది.

అఖిల్ ఏజెంట్ లాస్ట్ ఇయర్ రిలీజైంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా వర్క్ అవుట్ కాలేదు. అయితే అఖిల్ కష్టాన్ని గుర్తించిన ఆడియన్స్ అతనికి మంచి హిట్ రావాలని కోరుతున్నారు. హోంబలె ప్రొడక్షన్ లో అఖిల్ సినిమా అనగానే అక్కినేని ఫ్యాన్స్ లో ఎగ్జైట్మెంట్ మొదలైంది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. కొత్త దర్శకుడు అనీల్ ఒక పీరియాడికల్ కథతో ఈ సినిమా చేస్తున్నట్టు టాక్.

Also Read : Samantha : సమంత ప్లేస్ లో శృతి హాసన్.. మళ్లీ ఫాం లోకి వస్తున్న అమ్మడు..!

Exit mobile version