Site icon HashtagU Telugu

Lenin: అఖిల్ మాస్ హిట్ కోసం రెడీ.. లెనిన్ సినిమాలో కొత్త ట్విస్ట్

Lenin

Lenin

Lenin : అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘లెనిన్’ ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి హైప్ సొంతం చేసుకుంటోంది. ఈ సినిమాకు మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని పోస్టర్లు రిలీజ్ అయి, సినిమాపై ఆసక్తిని పెంచాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఆదిలో ఈ చిత్రానికి కథానాయికగా టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలాను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఆమెతో కొన్ని కీలక సీన్లను రెండు వారాలపాటు చిత్రీకరించారట. అయితే అప్రతేక్షిత పరిణామాల మధ్య శ్రీలీలా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఆమె తప్పుకున్నతరువాత మేకర్స్ షూటింగ్ పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు కసరత్తులు మొదలుపెట్టారు.

తాజా సమాచారం ప్రకారం, శ్రీలీలాతో తీసిన సన్నివేశాలను మళ్లీ భాగ్యశ్రీతో రీషూట్ చేయాలని నిర్ణయించారు. అంటే శ్రీలీలాతో చిత్రీకరించిన రెండు వారాల సన్నివేశాలను పూర్తిగా తీసేసి, వాటిని భాగ్యశ్రీతో మళ్లీ పునఃచిత్రీకరించబోతున్నారు. దీంతో యూనిట్‌కు పని భారం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. భాగ్యశ్రీ జూలై 16 నుంచి షూటింగ్‌లో జాయిన్ అవుతారని సమాచారం.

ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎస్.ఎస్. థమన్ పని చేస్తున్నారు. ఇప్పటివరకు థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మాస్ బీట్‌లకు మంచి రెస్పాన్స్ ఉంది. ఇక కథ విషయానికి వస్తే, మేకర్స్ ఇది ఒక మాస్‌ అప్పీల్ కలిగిన, స్టైలిష్ ట్రీట్‌మెంట్ ఉన్న రాజకీయ డ్రామాగా తెరకెక్కించబోతున్నారని టాక్.

అఖిల్ గతంలో చేసిన సినిమాల కన్నా భిన్నంగా ఉండేలా ‘లెనిన్’ రూపుదిద్దుకుంటోంది. ఈసారి అఖిల్‌కు ఇది భారీ హిట్ కావచ్చు అనే అంచనాలు పరిశ్రమలో వినిపిస్తున్నాయి. కథ, సాంకేతిక విలువలు, నటీనటుల సమన్వయం అన్నింటితో ఈ సినిమా విజయాన్ని సాధించగలదా అన్నది ఇప్పటి biggest curiosityగా మారింది.

Kodali Nani : సీఎం చంద్రబాబు షూ పాలిష్ చేస్తున్న కొడాలి నాని.. కారణం తెలుసా.?