Akhil : చిత్తూరు బ్యాక్ డ్రాప్ కథకు అఖిల్ గ్రీన్ సిగ్నల్

అక్కినేని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీ లోకి హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. మాస్ డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్షన్లో అఖిల్ మూవీ తో పరిచమయ్యాడు. కానీ ఈ సినిమా భారీ ప్లాప్ చూసింది.

Published By: HashtagU Telugu Desk
Akhil New Movie

Akhil New Movie

చిత్రసీమలో రాణించాలంటే బ్యాక్ గ్రౌండ్ (Movie Back Ground) అవసరం లేదని ఇటీవల చాలామంది యంగ్ హీరోలు నిరూపిస్తున్నారు. టాలెంట్ , కథ లో దమ్ము ఉండాలే కానీ ప్రేక్షకులు బ్రహ్మ రథం పడుతున్నారు. ఇక కథలో ఎలాంటి దమ్ము లేకున్నా, మూస కథలతో వచ్చిన ఏ హీరో అని కూడా చూడకుండా ప్రేక్షకులు డిజాస్టర్ కిందకు తోసేస్తున్నారు. అందుకు ఉదాహరణే అక్కినేని అఖిల్ (Akkineni Akhil).

అక్కినేని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీ లోకి హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. మాస్ డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్షన్లో అఖిల్ మూవీ తో పరిచమయ్యాడు. కానీ ఈ సినిమా భారీ ప్లాప్ చూసింది. ఆ తర్వాత చేసిన MR మజ్ను , హలో మూవీస్ సైతం ప్లాప్స్ జాబితాలో చేరాయి. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మూవీ చేసి ఫస్ట్ హిట్ కొట్టాడు. ఈ హిట్ తో ఫ్యాన్స్ అంత హ్యాపీ అయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

ఆ తర్వాత వెంటనే డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఏజెంట్ అనే భారీ బడ్జెట్ మూవీ చేసాడు. ఈ సినిమా కోసం గట్టిగానే కష్టపడ్డాడు కానీ ఈ మూవీ భారీ ప్లాప్ అవ్వడం తో మరో సినిమాకు చాల గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం ధీర అనే చిత్రాన్ని త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నాడు. ఇది లైన్లో ఉండగానే మరో సినిమాకు సైన్ చేసాడు. వినరో భాగ్యం విష్ణుకథ ఫేమ్ డైరెక్టర్ మురళీ కిశోర్ చెప్పిన కథ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో రానున్న ఈ చిత్రం చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో రురల్ డ్రామా నేపథ్యంలో సాగనుందని తెలుస్తోంది. మరి ఈ మూవీ ని ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్తారో చూడాలి.

ఇక ధీర విషయానికి వస్తే..యూవీ క్రియేషన్స్ (UV Creations) సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి ‘సాహో, రాధే శ్యామ్‌’కు అసోసియేట్‌గా పనిచేసిన అనిల్ కుమార్ (Anil Kumar) దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కథ విపరీతంగా నచ్చడంతో అఖిల్ ఈ మూవీకి ఓకే చెప్పాడు.

Read Also : YSR’s Birth Anniversary : వైస్సార్ కు కుటుంబ సభ్యుల నివాళులు

  Last Updated: 08 Jul 2024, 10:15 AM IST