Site icon HashtagU Telugu

Srikanth Addala : అఖిల్ కు ఈ ప్లాప్ డైరెక్టరైనా హిట్ ఇస్తాడో..?

akhil akkineni-Srikanth Addala combo movie

akhil akkineni-Srikanth Addala combo movie

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్రసీమలో అడుగుపెట్టి బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్నారు కుర్రహీరోలు. కానీ అక్కినేని అఖిల్ (Akhil Akkineni) మాత్రం చిత్రసీమలో భారీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ..ఇప్పటివరకు బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం కొట్టలేకపోతున్నాడు. స్టార్ డైరెక్టర్స్ , మంచి కథలు , భారీ నిర్మాణ సంస్థలతో వర్క్ చేస్తున్నప్పటికీ హిట్ మాత్రం తలుపుతట్టడం లేదు.

2015 లో అఖిల్ తో చిత్రసీమలోకి హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. వివి వినాయక్ వంటి స్టార్ డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కించినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత హలో , Mr. మజ్ను సినిమాలు చేసాడు. ఈ రెండు కూడా ప్లాప్ అయ్యాయి. నాల్గో చిత్రం Most Eligible బాచిలర్ కాస్త పర్వాలేదు అనిపించింది. ఆ తర్వాత వచ్చిన ఏజెంట్ మూవీ సైతం భారీ డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా కోసం అఖిల్ ఎంతో కష్టపడ్డాడు. కానీ ఫలితం మాత్రం తేడా కొట్టింది. అభిమానులు సైతం అఖిల్ విషయంలో తీవ్ర నిరాశలో ఉన్నారు. ఒక్క హిట్ ఐన పడితే బాగుండని కోరుకుంటున్నారు.

ప్రస్తుతం అఖిల్..శ్రీకాంత్ అడ్డాల తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) కెరియర్ కూడా గొప్పగా ఏమిలేదు. బ్రహ్మోత్సవం భారీ ప్లాప్ తర్వాత చాల గ్యాప్ తీసుకొని వెంకటేష్ తో నారప్ప చేసాడు. ఈ మూవీ డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలైంది. ప్రస్తుతం పెద కాపు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. ఈ తరుణంలోనే అఖిల్ కు ఓ కథ వినిపించాడట. ఆ కథ ఎలా ఉండబోతోంది..? ఫ్యామిలీ డ్రామానా..? యాక్షన్ కథానా అనేది తెలియాల్సి ఉంది.

Read Also : Raavi Leave: రావిఆకుతో అలా చేస్తే చాలు.. ఎలాంటి వ్యక్తైన సొంతం కావాల్సిందే?