Akhil Akkineni : అఖిల్ తో వంద కోట్ల తో సినిమానా..? అది కూడా కొత్త డైరెక్టర్ తో..!

అక్కినేని అఖిల్ (Akhil)…ఈ పేరు చెపితే ఎవరైనా అయ్యో పాపం అంటారు. అక్కినేని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుండి గ్రాండ్ గా ఇండస్ట్రీ లోకి వచ్చినప్పటికీ ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ఒక్క హిట్ లేదు. అఖిల్ నుండి మొదలుపెడితే మొన్నటి ఏజెంట్ వరకు అన్ని ప్లాప్ చిత్రాలే..మధ్యలో most eligible bachelor మూవీ కాస్త పర్వాలేదు అనిపించుకుంది తప్పితే అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద ఢమాల్ అన్నచిత్రాలే. మంచి కథలే ఎంచుకుంటూ వస్తునప్పటికి అఖిల్ కు అదృష్టం కలిసిరావడం […]

Published By: HashtagU Telugu Desk
Akhil New Movie

Akhil New Movie

అక్కినేని అఖిల్ (Akhil)…ఈ పేరు చెపితే ఎవరైనా అయ్యో పాపం అంటారు. అక్కినేని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుండి గ్రాండ్ గా ఇండస్ట్రీ లోకి వచ్చినప్పటికీ ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ఒక్క హిట్ లేదు. అఖిల్ నుండి మొదలుపెడితే మొన్నటి ఏజెంట్ వరకు అన్ని ప్లాప్ చిత్రాలే..మధ్యలో most eligible bachelor మూవీ కాస్త పర్వాలేదు అనిపించుకుంది తప్పితే అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద ఢమాల్ అన్నచిత్రాలే. మంచి కథలే ఎంచుకుంటూ వస్తునప్పటికి అఖిల్ కు అదృష్టం కలిసిరావడం లేదు.

We’re now on WhatsApp. Click to Join.

ఏజెంట్ (Akhil Agent) తర్వాత కొత్త చిత్రాన్ని ప్రకటించని అఖిల్..తాజాగా వంద కోట్ల తో తెరకెక్కబోయే చిత్రంలో నటిస్తున్నట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొత్త దర్శకుడు అనిల్ కుమార్ (Anil Kumar) డైరెక్షన్లో అఖిల్ ఓ మూవీ చేయబోతున్నాడట. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ (UV Creations)నిర్మిస్తున్నారని..అది కూడా వంద కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడం తో దీనిపై నెటిజన్లు స్పందిస్తూ వస్తున్నారు. ఇప్పుడు అఖిల్ ఉన్న సిచువేషన్ కు రూ.100 కోట్ల భారీ సినిమా అవసరమా..? అని ప్రశ్నిస్తున్నారు. హీరో బ్యాక్ గ్రౌండ్ కాదు మార్కెట్ లో ఉన్న ఆయన రేంజ్ చూసి సినిమా చేయాలనీ నిర్మాతలకు సూచిస్తున్నారు. కథ బాగుంటే పెద్ద బడ్జెట్ అవసరం లేదని..ఉదాహరణ కు బేబీ మూవీనే తీసుకోండని అంటున్నారు. మరి నిజంగా అఖిల్ తో వంద కోట్ల తో సినిమా చేస్తున్నారా..? లేదా అనేది తెలియాల్సి ఉంది.

Read Also :Bhagavanth Kesari: ‘భగవంత్‌ కేసరి నుంచి ఉయ్యాలో ఉయ్యాలా వీడియో సాంగ్ రిలీజ్

  Last Updated: 18 Nov 2023, 04:06 PM IST