నందమూరి అభిమానులకు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. గత కొద్దీ నెలలుగా అఖండ 2 కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలియంది కాదు..ఇటీవల రిలీజ్ అయినా ట్రైలర్ , మేకింగ్ ఇలా ప్రతిదీ సినిమా పై అంచనాలు పెంచేయడం తో ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ఆత్రుత ఉన్న సమయంలో ప్రీమియర్స్ రద్దు కావడం అభిమానులను , సినీ ప్రేక్షకులను బాధకు గురి చేయగా…ఇక ఈరోజు సినిమా రిలీజ్ అవుతుందని అనుకుంటున్నా సమయంలో సినిమా విడుదల కావడం లేదని నిర్మాతలు ప్రకటించడం అభిమానుల్లో ఆగ్రహం నింపుతుంది.
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల కలయికలో రూపొందిన భారీ యాక్షన్ చిత్రం ‘అఖండ-2’ విడుదల చివరి నిమిషంలో వాయిదా పడటం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ రోజు (డిసెంబర్ 5, 2025) ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సిన ఈ చిత్రం, ‘అనివార్య కారణాల’ వల్ల వాయిదా పడినట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధికారికంగా ప్రకటించింది. ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత ఈ కాంబో నుండి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశారు. అనూహ్యంగా విడుదల వాయిదా పడటంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
Health Tips: గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగుతున్నారా.. అయితే ఇది మీకోసమే?
ఈ విడుదలలో జాప్యానికి గల ప్రత్యేక కారణాలను చిత్ర బృందం స్పష్టంగా వెల్లడించనప్పటికీ, ఇలాంటి అగ్ర హీరోల భారీ చిత్రాలు వాయిదా పడటానికి సాధారణంగా పోస్ట్-ప్రొడక్షన్ (VFX, డబ్బింగ్, సౌండ్ మిక్సింగ్) పనుల్లో ఆలస్యం, లేదా దేశవ్యాప్త పంపిణీ (Distribution) వ్యవస్థలో తలెత్తిన క్లిష్టమైన సమస్యలు కారణాలుగా ఉండవచ్చు. మరీ ముఖ్యంగా సినిమా ప్రీమియర్ షోలను సైతం రద్దు చేస్తున్నట్లు నిన్న సాయంత్రం ప్రకటించిన కొద్దిసేపటికే విడుదల వాయిదా నిర్ణయం తీసుకోవడం చూస్తుంటే, చివరి నిమిషంలో తలెత్తిన ఏదో ఒక తీవ్రమైన సాంకేతిక లేదా ఆర్థికపరమైన సమస్య ఈ నిర్ణయానికి దారి తీసిందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం సినిమా యూనిట్‌తో పాటు, విడుదలకు సర్వం సిద్ధం చేసుకున్న పంపిణీదారులలోనూ గందరగోళాన్ని సృష్టించింది.
అభిమానులు, ప్రేక్షకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ‘అఖండ-2’ కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాణ సంస్థ హామీ ఇచ్చింది. ‘అఖండ’ సాధించిన అపూర్వ విజయం దృష్ట్యా, ఈ సీక్వెల్ నాణ్యత విషయంలో రాజీ పడకుండా, అన్ని సన్నాహాలను పూర్తి చేసుకుని, సరైన సమయంలో థియేటర్లలోకి రావాలనే లక్ష్యంతోనే ఈ వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మరో మూడు వారాలు ఆగితే సంక్రాంతి ఫీవర్ వచ్చేస్తుంది. వరుస సెలవులతో థియేటర్ల వద్ద సందడి నెలకొంటుంది. ఈ క్రమంలో సినిమాకు వచ్చిన అడ్డంకులు తొలగించుకుని వాయిదా పడిన అఖండ-2ను సంక్రాంతి బరిలో నిలిపే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
