Ajith-Shalini : అజిత్‌, షాలిని లవ్ కోడ్ ఏంటో తెలుసా..? సీక్రెట్‌గా ప్రేమించుకుంటున్న టైంలో..

వీరిద్దరి ప్రేమను మాత్రం కొన్ని రోజులు రహస్యంగా మెయిన్‌టైన్ చేస్తూ వచ్చారు. ఇక ఆ సినిమా తరువాత ఇద్దరు ఇతర చిత్రాలతో బిజీ అయ్యారు. అప్పటిలో స్మార్ట్ ఫోన్లు, వాట్సాప్ లు లేవుగా..

Published By: HashtagU Telugu Desk
Ajith Shalini Secret Love code while Calling in early Love stage

Ajith Shalini Secret Love code while Calling in early Love stage

కోలీవుడ్ స్టార్ కపుల్ అజిత్‌(Ajith)-షాలిని(Shalini) జంట గురించి సౌత్ ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మణిరత్నం సఖి ‘సినిమాతో’ అందరి మనసు దోచుకున్న షాలిని.. తన కళ్ళతో మాయ చేసి అజిత్ మనసుని కూడా దొంగలించేసింది. 1999లో ‘అమరకలమ్‌’ (Amarkalam) సినిమా సెట్ లో వీరిద్దరి ప్రేమ మొదలైంది. ఈ ఇద్దరు కలిసి నటించిన మొదటి సినిమా, ఏకైక సినిమా ఇదే. ఈ మూవీ షూటింగ్ సమయంలో అజిత్ పొరపాటు వల్ల షాలిని చెయ్యి కట్‌ అయ్యి బ్లడ్ కూడా వచ్చింది.

తన పొరపాటు వల్లే షాలిని బాధ పడుతుందని ఫీల్ అయిన అజిత్.. ఆమె గాయం తగ్గే వరకు సెట్ లో తనని దగ్గర ఉండి ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడట. ఈ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అందుకనే అంటారేమో గాయం ఒక మధుర జ్ఞాపకం అని. కాగా వీరిద్దరి ప్రేమను మాత్రం కొన్ని రోజులు రహస్యంగా మెయిన్‌టైన్ చేస్తూ వచ్చారు. ఇక ఆ సినిమా తరువాత ఇద్దరు ఇతర చిత్రాలతో బిజీ అయ్యారు. అప్పటిలో స్మార్ట్ ఫోన్లు, వాట్సాప్ లు లేవుగా, దీంతో ‘నువ్వు అక్కడ ఉంటే, నేను ఇక్కడ ఉంటే’ అన్నట్టుగా మారింది వీరి ప్రేమగాథ.

అయితే ఆ టైంలోనే మార్కెట్‌ లోకి మొబైల్‌ ఫోన్లు రావడం మొదలయ్యాయి. ఈ ఫోన్స్ కూడా అందరి దగ్గర ఉండేవి కావు. 1999లో కుంచకో బోబన్‌ (Boban Kunchacko) హీరోగా నటిస్తున్న ‘నీరమ్‌’ సినిమాలో షాలిని హీరోయిన్ గా నటించింది. ఆ సెట్స్ లో కుంచకో బోబన్‌ దగ్గర మాత్రమే మొబైల్ ఉండేది. దీంతో అజిత్ అతనికి ఫోన్ చేసి.. అందరి ముందు అజిత్ నుంచి ఫోన్ వచ్చింది అని చెప్పకుండా ‘ఏకే-47 కాలింగ్‌’ అని పిలవమని చెప్పేవాడట.

దీంతో ఆ హీరో.. “సోనా.. ఏకే-47 కాలింగ్‌” అని పిలిచి షాలినికి ఫోన్ ఇచ్చేవాడట. ఇలా అప్పుడప్పుడు ఫోన్స్ రావడంతో ఈ విషయంపై నీరమ్ మూవీ డైరెక్టర్ కి అనుమానం వచ్చి.. ఒకసారి కుంచకోను ఆ ఏకే-47 విషయం ఏంటని అడిగాడట. కుంచకో దర్శకుడికి అసలు విషయం చెప్పడంతో ఇక తరువాత రోజు అజిత్ నుంచి ఫోన్ కాల్ రాకపోవడంతో ఆ దర్శకుడు షాలినిని పిలిచి.. “ఏకే-47 నుంచి ఈరోజు కాల్ ఎందుకు రాలేదు” అని అడిగాడట. దానికి షాలిని చిరునవ్వులు చిందిస్తూ తెగ సిగ్గుపడిపోయిందట.

 

Also Read Film News: పవన్ తో సురేందర్ రెడ్డి సినిమా ?

  Last Updated: 03 Sep 2023, 11:00 PM IST