Ajith-Shalini : అజిత్‌, షాలిని ప్రేమ కథ ఎలా మొదలైందో తెలుసా..?

అజిత్ అండ్ షాలిని 1999 లో ‘అమరకలమ్‌’ (Amarkalam) సినిమాలో కలిసి నటించారు. ఈ మూవీ సెట్స్ లోనే వీరిద్దరి ప్రేమ మొదలయింది.

Published By: HashtagU Telugu Desk
Ajith Shalini love story full details here

Ajith Shalini love story full details here

కోలీవుడ్ స్టార్ కపుల్ అజిత్‌(Ajith)-షాలిని(Shalini) జంట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2000 సంవత్సరంలో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు వీరిద్దరి మ్యారేజ్ లైఫ్ పై ఎన్ని రూమర్స్ వస్తున్నా.. వాటికీ వాళ్ళిద్దరి ప్రేమతోనే సమాధానం చెబుతూ వస్తున్నారు. అయితే అసలు వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది..? ప్రేమ ప్రయాణం మొదలుపెట్టేలా చేసిన ఆ సందర్భం ఏంటో తెలుసా..?

అజిత్ అండ్ షాలిని 1999 లో ‘అమరకలమ్‌’ (Amarkalam) సినిమాలో కలిసి నటించారు. ఈ మూవీ సెట్స్ లోనే వీరిద్దరి ప్రేమ మొదలయింది. ఈ సినిమాలోని ఒక సీన్ ని చిత్రీకరిస్తున్న సమయంలో అజిత్ పొరపాటున షాలిని చేతిని కట్‌ చేశాడు. దీంతో గాయం అయ్యి రక్తం రావడం జరిగింది. ఇక ఆ గాయం తన పొరపాటు వల్లే అయ్యిందని అజిత్ చాలా ఫీల్ అయ్యిపోయాడట. ఆ గిల్ట్ వల్ల షాలినికి గాయం తగ్గే వరకు ఆమెను దగ్గర ఉండి ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడట. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

మొదటిగా ప్రేమ ప్రపోజల్ పెట్టింది అజిత్. ఇక ఆ గాయం సమయంలో అజిత్ నుంచి వచ్చిన కేరింగ్ అండ్ లవ్ చూసిన షాలిని.. రెండో మాట లేకుండా వెంటనే ఒకే చెప్పేసిందట. ఇదంతా ‘అమరకలమ్‌’ మూవీ షూటింగ్ సమయంలోనే జరిగిపోయింది. అలా ఒక గాయం వారిద్దరి ప్రేమ జర్నీకి కారణమైంది. ఆ తరువాత ఏప్రిల్ 24, 2000 లో ఇద్దరు పెళ్లి బంధంతో ఒక్కటి అయ్యారు. పెళ్లి తరువాత షాలిని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం వీరిద్దరికి ఇద్దరు పిల్లలు. అమ్మాయి పేరు అనౌష్క, అబ్బాయి పేరు ఆద్విక్‌.

షాలిని చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ కెరీర్ మొదలుపెట్టి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. చిరంజీవి ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా షాలిని నటించింది. ఆ తరువాత మణిరత్నం ‘సఖి’ సినిమాతో తెలుగు వారికీ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఇక అజిత్ తన పలు సూపర్ హిట్ సినిమాలతో ఆడియన్స్ ని ఇప్పటికి పలకరిస్తూనే వస్తున్నాడు.

 

Also Read : Akira Nandan : పవన్ తనయుడు అకిరా హీరో అవ్వడంట.. కానీ సినీ పరిశ్రమే.. మరి ఏమవుతాడు?

  Last Updated: 23 Aug 2023, 08:48 PM IST