Site icon HashtagU Telugu

Ajith Kumar: షూటింగ్ లో హీరో అజిత్ కారుకు యాక్సిడెంట్.. నెట్టింట వీడియో వైరల్!

Ajith Kumar

Ajith Kumar

కొలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ గురించి మనందరికీ తెలిసిందే. అజిత్ కు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అజిత్ నటించిన సినిమాలు తెలుగులో కూడా విడుదలైన విషయం తెలిసిందే. ఇటీవల తునీవు అనే మూవీతో ప్రేక్షకులను పలకరించారు అజిత్. ఈ చిత్రాన్ని తెలుగులో తెగింపు పేరుతో రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తర్వాత అజిత్ నటిస్తోన్న సినిమా విడతల. సస్సెన్స్ థ్రిల్లర్‏గా వస్తోన్న ఈ సినిమాలో సంజయ్ దత్, అఏర్జున్, అరుణ్ విజయ్, రెజీనా కసాండ్రా, ఆరవ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join
ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా నీరవ్ షా సినిమాటో గ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభమైనప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ నీ విడుదల చేయలేదు. అలాగే ఈ మూవీ షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయిందంటూ తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. అజిత్ ఆరోగ్య సమస్యలు, సర్జరీ కారణంగా ఈ మూవీ షూటింగ్ ఆగిపోయినట్లు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. విడతల సినిమా కోసం అజిత్ తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ షూటింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ యూరోప్ దేశంలో జరుగుతుంది. ఈ క్రమంలోనే అజిత్ కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. అజిత్ నడుపుతున్న కారు సైడ్ ఆపే ప్రయత్నంలో కారుపై అతడు నియంత్రణ కోల్పవడంతో రోడ్డు పక్కకు కారు పడిపోయినట్లుగా తెలుస్తోంది. అజిత్ నడుపుతున్న కారులోనే మరో నటుడు ఆరవ్ కనిపిస్తున్నాడు. అతడి చేతులు కట్టేసి మెడకు టేపుతో కట్టినట్లుగా కనిపిస్తుంది. విడుతల షూటింగ్ లో భాగంగా యాక్షన్ సీన్ జరుగుతున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Also Read: Rashmi Gautham: యాంకర్ రష్మి పరువు తీసేసిన జబర్దస్త్ కమెడియన్.. స్టేజ్ పైకి పిలిచి మరీ అలా!

ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలను అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర షేర్ చేస్తూ విదాముయార్చి చిత్రీకరణ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. విడతల చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే అంచనాలు కలిగిస్తున్నారు మేకర్స్. మరి ఇది నిజంగానా లేకపోతే సినిమాలో భాగమా అన్నది తెలియాల్సి ఉంది.

Also Read: Vijay : రజనీకాంత్ ను మించి రెమ్యూనరేషన్ అందుకుంటున్న విజయ్.. ఒక్కో మూవీ అన్ని కోట్లు?

Exit mobile version