Site icon HashtagU Telugu

Ajith Kumar: షూటింగ్లో అజిత్ కి కారు ప్రమాదంపై స్పందించిన మూవీ మేకర్స్.. నిజమే అంటూ?

Ajith Kumar

Ajith Kumar

తమిళ స్టార్ హీరో అజిత్ గురించి మనందరికీ తెలిసిందే. అజిత్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇకపోతే అజిత్ గత ఏడాది తునీవు అనే మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉన్న అజిత్. ఇప్పుడు సినిమాలలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. గత కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది.

We’re now on WhatsApp. Click to Join
అయితే ఇటీవల ఈ మూవీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా అనుకోకుండా అజిత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఆ వీడియోని చూసిన అభిమానులు భయపడుతూ కామెంట్ల మీద కామెంట్ల వర్షం కురిపించారు. కాగా ఆ వీడియోలో అజిత్‏ కారు నడుపుతుండగా.. నటుడు ఆరవ్‏ను చేతులు కట్టేసి కూర్చో పెట్టారు. అదే సమయంలో అనుకోకుండా కారు నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. వెంటనే అప్రమత్తమైన చిత్ర యూనిట్ అజిత్ కారు వద్దకు పరుగులు పెట్టారు.

Also Read: Tamannaah Bhatia: మరోసారి ఘాటు అందాలతో రెచ్చిపోయిన తమన్నా.. అందాల ఆరబోత మామూలుగా లేదుగా?

కారులో చిక్కుకున్న అజిత్, ఆరవ్ ఇద్దరిని రక్షించారు. అజిత్ కారు ప్రమాద వీడియో నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు కంగారుపడ్డారు. డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ చేసిన అజిత్ పై కొందరు ప్రశంసలు కురిపిస్తుండగా.. ఇలాంటి రిస్క్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు ఫ్యాన్స్. అజిత్ ఆరోగ్యం ఎలా ఉందంటూ కామెంట్స్ వర్షం కురిపించారు. తాజాగా కారు ప్రమాద ఘటనపై అజిత్ టీం స్పందించింది. సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియో గత ఏడాది నవంబర్ చివరి వారంలో తీసినది.. ఇప్పుడు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. హైవేపై యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు. ఆయన నడిపిన కారు టైరులో గాలి పూర్తిగా తగ్గిపోవడం వల్ల అది అదుపుతప్పి బోల్తా పడింది. కారులో ఉన్న ఆరవ్, అజిత్ ఇద్దరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వాళ్లకు ఎలాంటి గాయాలు కాలేదు. మూడు గంటల్లోనే తిరిగి షూటింగ్ లో పాల్గొన్నారు అని తెలిపారు. ఈ చిత్రం ఈ ఏడాది విడుదల కానుంది.

Also Read: Suriya – Jyothika: భర్తతో కలిసి జిమ్లో వర్కౌట్స్ చేస్తూ తెగ కష్టపడుతున్న జ్యోతిక.. వీడియో వైరల్!