Ajith Good Bad Ugly కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ లీడ్ రోల్ లో ఆధిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీతో తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళంలో భారీగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా సెట్స్ మీదకు వెళ్లే టైం లోనే 2025 సంక్రాంతికి సినిమా రిలీజ్ అనౌన్స్ చేశారు. కోలీవుడ్ లో అజిత్ సినిమా వస్తే పోటాపోటీ ఉంటుంది. కానీ తెలుగులో అజిత్ సినిమా వస్తే కష్టమే అని చెప్పొచ్చు.
ఇదిలాఉంటే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా నుంచి లేటెస్ట్ గా అజిత్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సినిమా ఫస్ట్ లుక్ అంటే ఒకటే స్టిల్ ఉంటుంది. కానీ గుడ్ బ్యాడ్ అగ్లీ కాబట్టి అజిత్ కూడా 3 డిఫరెంట్ స్టిల్స్ తో కనిపించాడు. ఈ పోస్టర్ అజిత్ మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. పోస్టర్ తోనే తలా ఫ్యాన్స్ అంతా సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అవుతున్నారు.
ఇక ఈ సినిమా డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ అజిత్ తో తన వర్క్ ఎక్స్ పీరియన్స్ గురించి చెబుతూ ఎమోషనల్ అవుతున్నాడు. తన అభిమాన నటుడిని డైరెక్ట్ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. సెట్ లో ప్రతి రోజు ఎంజాయ్ చేస్తున్నామని అన్నారు. లాస్ట్ ఇయర్ మార్క్ ఆంటోనితో మెప్పు పొందిన్మ ఆధిక్ అజిత్ తో గుడ్ బ్యాడ్ అగ్లీతో భారీ టార్గెట్ పెట్టుకున్నాడు. మరి సినిమా పోస్టర్ తో ఇచ్చిన జోష్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి.
Also Read : Ajay with Ajay Devagan : అజయ్ వర్సెస్ అజయ్.. సిగం అగైన్ తో అక్కడ ఎంట్రీ..!