Site icon HashtagU Telugu

Ajay Ghosh : మొన్న విలన్ నిన్న కమెడియన్ ఇప్పుడు హీరో.. ఈ దూకుడు ఏంటో.. మ్యాజిక్ షాప్ మూర్తితో అజయ్ ఘోష్..!

Ajay Ghosh Lead Role In Music Shop Murthy

Ajay Ghosh Lead Role In Music Shop Murthy

Ajay Ghosh సినిమాల్లో అంతే ఒకలా ఆడియన్స్ కు పరిచయమైన ఒక నటుడితో ఎలాంటి చిత్ర విచిత్రమైన ప్రయోగాలైనా చేస్తుంటారు. విలన్ తో కామెడీ.. కమెడియన్ తో సీరియస్ రోల్స్ ఇలా ప్రయోగాలు చేయడం మన వాళ్లకి అలవాటే. అలాంటి వెరైటీ ప్రయోగమే మరోసారి చేస్తున్నారు మ్యూజిక్ షాప్ మూర్తి టీం. ఫ్లై హై బ్యానర్ లో హర్ష గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాను శివ పాలడుగు డైరెక్ట్ చేస్తున్నారు.

ఈ సినిమాలో లీడ్ రోల్ లో అజయ్ ఘోష్ నటిస్తున్నారు. మొన్నటిదాకా విలన్ గా నెగిటివ్ పాత్రల్లో నటించిన ఈయన ఈమధ్య కమెడియన్ గా కామెడీ చేస్తూ వస్తున్నాడు. ఎలాగోలా ఆడియన్స్ అతన్ని యాక్సెప్ట్ చేస్తున్నారని గుర్తించిన మేకర్స్ అతనితో మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాతో మెయిన్ లీడ్ గా ఎంపిక చేశారు. దీనికి సంబందించిన పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు.

పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇక్కడ మరో క్రేజీ థింగ్ ఏంటంటే ఈ సినిమాలో హీరోయిన్ గా చాందిని చౌదరి నటిస్తుంది. అజయ్ ఘోష్ హీరో ఏంటో.. చాందిని చౌదరి హీరోయిన్ ఏంటో.. అసలు మ్యూజిక్ షాప్ మూర్తి కథ ఏంటో సినిమా వస్తేనే కానీ తెలియదు.

Also Read : Ambajipeta Marriage Band Collections : అంబాజీపేట బాక్సాఫీస్ దూకుడు.. రెండు రోజుల్లో సుహాస్ సినిమా ఎంత రాబట్టింది అంటే..?