Bollywood Movies Leaked: బాలీవుడ్ మూవీలకు ‘పైరసీ’ దెబ్బ

ఇప్పటికే రాకీ భాయ్ కేజీఎఫ్-2 దెబ్బకు విలవిలలాడుతున్న బాలీవుడ్ కు మరో పెద్ద దెబ్బ తగిలింది.

Published By: HashtagU Telugu Desk
Bollywood

Bollywood

ఇప్పటికే రాకీ భాయ్ కేజీఎఫ్-2 దెబ్బకు విలవిలలాడుతున్న బాలీవుడ్ కు మరో పెద్ద దెబ్బ తగిలింది. అజయ్ దేవగన్ నటించిన “runway 34” , టైగర్ ష్రాఫ్ యాక్ట్ చేసిన “heropanti” సినిమాలు ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా ఏప్రిల్ 29నే థియేటర్లలో విడుదలయ్యాయి. వీటి కెమెరా ప్రింట్ ను తమిళ్ రాకర్స్, మూవీ రూల్స్ అనే మూవీ పైరసీ వెబ్ సైట్లు అప్ లోడ్ చేశాయి. టొరెంట్ లోనూ దీన్ని డౌన్లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంచారు. దీంతో ఈ సినిమాలకు కలెక్షన్స్ పడిపోయాయి. రిలీజ్ తర్వాతి రెండో రోజైన ఆదివారం కూడా కలెక్షన్స్ అంతంతే జరిగాయి. ఒకవైపు సౌత్ ఇండియా సినిమాల సత్తాను తట్టుకోలేక పోతున్న బాలీవుడ్ కు పైరసీ పెద్ద సవాల్ గా మారింది.

  Last Updated: 01 May 2022, 06:08 PM IST