Site icon HashtagU Telugu

Aishwarya Rai : రెండు దశాబ్దాలుగా.. ప్రతి సంవత్సరం కాన్స్ లో ఐశ్వర్య రాయ్ హాజరు.. మొదటిసారి ఎప్పుడో తెలుసా??

Aishwarya Rai Bachchan attending cannes from last 20 years

Aishwarya Rai Bachchan attending cannes from last 20 years

ప్రతి సంవత్సరం ఫ్రాన్స్(France) లో నిర్వహించే ప్రతిష్టాత్మక కాన్స్ ఫిలిం ఫెస్టివల్(Cannes Film Festival) ఇటీవల గ్రాండ్ గా మొదలైంది. మే 16 నుంచి మొదలైన కాన్స్ ఫిలిం ఫెస్టివల్ మే 27 వరకు సాగనుంది. ఈ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనడానికి మన ఇండియా(India) నుంచి పలువురు నటీనటులు, టెక్నీషియన్స్ విచ్చేశారు. సారా అలీఖాన్, మృణాల్ ఠాకూర్, అనుష్క శర్మ, సన్నీ లయన్.. లాంటి పలువురు మొదటిసారి కాన్స్ లో పాల్గొంటున్నారు.

అయితే ఇండియా నుంచి ఒకప్పటి స్టార్ హీరోయిన్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ మాత్రం గత రెండు దశాబ్దాలుగా కాన్స్ ఫిలిం ఫెస్టివల్ కు హాజరవుతూ సరికొత్త చరిత్ర సృష్టించింది. మొదటి సారి ఐశ్వర్య రాయ్ 2002 సంవత్సరంలో దేవదాస్ సినిమా తరపున 55 వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో హాజరైంది. షారుఖ్, ఐశ్వర్య, మాధురి దీక్షిత్ ముఖ్య పాత్రల్లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పటి కాన్స్ లో ప్రదర్శితమైంది. అప్పట్నుంచి 20 ఏళ్లుగా ప్రతి సంవత్సరం ఐశ్వర్య రాయ్ కాన్స్ లో పాల్గొంటుంది. ఇటీవల తన కూతురు ఆరాధ్యతో కలిసి పాల్గొంటుంది ఐశ్వర్య రాయ్.

ఈసారి కూడా ఐశ్వర్య కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొంది. కాన్స్ కి వచ్చే వాళ్ళు డిఫరెంట్ డ్రెస్సులు వేసుకొస్తారని తెలిసిందే. ఐశ్వర్య కూడా రకరకాల డ్రెస్సులతో అలరించింది. ఈ సారి ఐశ్వర్య మొదటి రోజు కాన్స్ లో బ్లాక్ డ్రెస్ లో వైట్ గొడుగు లాగా తలపైకి వచ్చేలా ఉన్న వెరైటీ డ్రెస్ వేసుకుంది. ఈ డ్రెస్ లో ఐశ్వర్య ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

Also Read : Highest Paid Indian Actor: రెమ్యూనరేషన్ లో విజయ్ దళపతి రికార్డ్, ఒక్క సినిమాకే 200 కోట్లా..!