Aishwarya – Abhishek Divorce : ముకేశ్ పెళ్లి సంబరాల్లో బయటపడ్డ ఐశ్వర్య – అభిషేక్‌ల ఎడబాటు

అభిషేక్ బచ్చన్ తన తండ్రి అమితాబ్, తల్లి జయ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలకు పోజులివ్వగా ఐశ్వర్య రాయ్ మాత్రం తన కూతురు ఆరాధ్యతో కలిసి వేరుగా ఫొటోలు దిగారు. ఇలా వేర్వేరుగా ఫొటోలు దిగడంపై సోషల్ మీడియా వేదికగా అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు

Published By: HashtagU Telugu Desk
Aishwarya Rai, Abhishek Bac

Aishwarya Rai, Abhishek Bac

ఐశ్వర్య రాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌లు విడాకులు (Aishwarya Rai, Abhishek Bachchan Divorce) తీసుకోబోతున్నారనే వార్తలు గత కొద్దీ రోజులుగా ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. వీరి మధ్య మనస్పర్థలు రావడంతోనే వీళ్లు విడిపోతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ విడాకుల వార్తలపై ఇప్పటి వరకు ఈ జంట స్పందించలేదు. అయితే తాజాగా విడాకులపై పరోక్షంగా క్లారిటీ వచ్చేసింది. అనంత్ అంబానీ వివాహానికి (Ambani Wedding) బచ్చన్ ఫ్యామిలీ మొత్తం హాజరైంది.

We’re now on WhatsApp. Click to Join.

అభిషేక్ బచ్చన్ తన తండ్రి అమితాబ్, తల్లి జయ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలకు పోజులివ్వగా ఐశ్వర్య రాయ్ మాత్రం తన కూతురు ఆరాధ్య (Aishwarya Rai and daughter Aaradhya)తో కలిసి వేరుగా ఫొటోలు దిగారు. ఇలా వేర్వేరుగా ఫొటోలు దిగడంపై సోషల్ మీడియా వేదికగా అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఐశ్వర్య రాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌లు విడాకులు తీసుకున్నారని కొంతమంది..లేదు ఇంకా తీసుకోలేదు ..ప్రస్తుతం దూరంగా ఉన్నారని ఇంకొంతమంది మాట్లాడుకుంటుండగా..ఇప్పుడు వేరు వేరుగా ఫొటోస్ దిగేసరికి విడాకులు ఖరారే అన్నట్లు స్పష్టం చేస్తున్నారు.

చిత్రసీమలో విడాకులు అనేవి కామన్. ఎంతోమంది షూటింగ్ సమయాల్లో దగ్గరవ్వడం..కొంతకాలం సహజీవనం చేయడం..ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం, పిల్లలను కనడం..ఆ తర్వాత మనస్పర్థలతో విడాకులు తీసుకోవడం వంటింది ఎంతోమంది చేసారు. ఇప్పుడు ఐశ్వర్య రాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌లు విడాకులు తీసుకోవడం లో కూడా పెద్ద వింతేమీ లేదని అభిప్రాయపడుతున్నారు. ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ చాలా సినిమాల్లో కలిసి నటించారు. ఆ తర్వాత వారి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 2007లో వీరు పెళ్లి చేసుకున్నారు. ఐశ్వర్యరాయ్ 2011లో ఆడపిల్ల (ఆరాధ్య)కి జన్మనిచ్చింది.

Read Also : Chandrababu : ఎవ్వరు ఆ పని చేయొద్దు – చంద్రబాబు కీలక సూచన

  Last Updated: 13 Jul 2024, 03:49 PM IST