Mixup Pre Look Poster : ఆహా ఓటీటీలో ఘాటైన మిక్సప్.. పోస్టర్ తోనే షాక్ ఇచ్చారుగా..!12:12

Mixup Pre Look Poster కన్నడ భామ అక్షర గౌడ లీడ్ రోల్ లో వస్తున్న సినిమా మిక్సప్. సినిమాను ఆహా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్

Published By: HashtagU Telugu Desk
Aha Ott Mixup Pre Look Poster Released

Aha Ott Mixup Pre Look Poster Released

Mixup Pre Look Poster కన్నడ భామ అక్షర గౌడ లీడ్ రోల్ లో వస్తున్న సినిమా మిక్సప్. సినిమాను ఆహా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. మిక్సప్ కోరిక ప్రేమను జయించగలదా అనే క్యాప్షన్ తో అమ్మాయి పెదవులను పోస్టర్ పై ఉంచి సినిమా కంటెంట్ ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పారు. అక్షర గౌడ (Akshara Gowda) ఈ సినిమాలో గ్లామర్ రోల్ లో కనిపించనుందని తెలుస్తుంది.

We’re now on WhatsApp : Click to Join

ఈ సినిమాలో ఆమెతో పాటుగా పూజ జవేరి (Puja Jhaveri) కూడా నటించింది. ఆదర్శ్, కమల్ కామరాజు కూడా ఇందులో భాగం అయ్యారు. అయితే డైరెక్టర్ ఎవరన్నది చెప్పలేదు కానీ ఆహా ఓటీటీలో త్వరలో మిక్సప్ అంటూ పోస్టర్ తో సర్ ప్రైజ్ చేశారు. ఇక అక్షర గౌడ విషయానికి వస్తే కింగ్ నాగార్జున మన్మథుడు 2 లో స్పెషల్ సాంగ్ చేసింది ఈ అమ్మడు.

రామ్ వారియర్ లో ఆదికి భార్య్గా చేసింది. విశ్వక్ సేన్ (Viswak Sen) ధంకీతో పాటుగా రెజినా నటించిన నేనేనా సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం సుధీర్ బాబు లీడ్ రోల్ లో వస్తున్న హరోమ్ హర సినిమాలో కూడా నటిస్తుంది. ఆహా ఓటీటీలో వస్తున్న మిక్సప్ సినిమా మాత్రం సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని తెలుస్తుంది.

ఆహాలో ఫస్త్ టైం బోల్డ్ కంటెంట్ తో రాబోతున్న ఈ మూవీ ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి. ఈ మిక్సప్ మూవీ ఆహా తెలుగుతో పాటుగా తమిళంలో కూడా రిలీజ్ చేస్తున్నారని తెలుస్తుంది.

Also Read : Allu Arjun : అట్లీ బోయపాటి మధ్య త్రివిక్రం..!

  Last Updated: 25 Jan 2024, 11:27 AM IST