Site icon HashtagU Telugu

Shah Rukh Khan : షారుక్ ఖాన్‌కు హత్య బెదిరింపు.. దుండగుడు ఎవరు అంటే..?

Shah Rukh Khan Threatening Call Chhattisgarh Faizan Khan

Shah Rukh Khan : మొన్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు.. ఇప్పుడు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌కు బెదిరింపు కాల్ వచ్చింది.  దీనిపై ముంబైలోని బాంద్రా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. షారుక్‌కు హాని తలపెడతానంటూ గుర్తుతెలియని వ్యక్తి కాల్ చేసి బెదిరించాడని ఎఫ్ఐఆర్‌లో పోలీసులు ప్రస్తావించారు. కాల్ వచ్చిన నంబరును పోలీసులు ట్రాక్ చేయగా.. అది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌లో ఉన్న లొకేషన్‌ను చూపించింది. ఫైజాన్ ఖాన్ అనే వ్యక్తి ఫోను నుంచి షారుక్‌ను బెెదిరిస్తూ మెసేజ్ వచ్చిందని వెల్లడైంది.  దీంతో ముంబై పోలీసులు వెంటనే రాయ్‌పూర్ పోలీసులకు లొకేషన్ వివరాలు, ఫోన్ నంబరు తాలూకూ సమాచారాన్ని అందించారు. బెదిరింపు కాల్ చేసిన నిందితుడిని పట్టుకునేందుకు రాయ్‌పూర్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. కాగా, దాదాపు  రూ.50 లక్షల ముడుపులను తనకు ఇవ్వకుంటే షారుక్‌ ప్రాణాలతో బతకలేడని సదరు కాలర్ బెదిరించాడని పోలీసు వర్గాలు తెలిపాయి.

Also Read :Government Jobs : ఉద్యోగ నియామకాల రూల్స్‌‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు

షారుక్ ఖాన్‌కు గత సంవత్సరం అక్టోబరులోనూ హత్య బెదిరింపు వచ్చింది. దీంతో ఆయన సెక్యూరిటీ లెవల్‌ను ‘వై ప్లస్’ కేటగిరీకి పెంచారు. ఇందులో భాగంగా షారుక్ (Shah Rukh Khan) సెక్యూరిటీ కోసం ఆరుగురు సాయుధ భద్రతా సిబ్బంది నిత్యం వెంట ఉంటారు.  అంతకుముందు షారుక్ వెంటనే ఇద్దరు మాత్రమే సాయుధ భద్రతా సిబ్బంది ఉండేవారు. మహారాష్ట్ర రాజకీయ నేత బాబా సిద్దిఖీ హత్య జరిగినప్పటి నుంచి సల్మాన్ ఖాన్‌కు వరుస పెట్టి హత్య బెదిరింపులు వస్తున్నాయి. దీంతో ఆయన సెక్యూరిటీని కూడా పెంచారు. సల్మాన్‌కు పర్సనల్‌గా సెక్యూరిటీ కోసం దాదాపు 40 మంది టీమ్ ఉంటుంది. ప్రత్యేకించి గుజరాత్‌లోని సబర్మతీ జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయికి చెందిన ముఠా నుంచి సల్మాన్‌కు పదేపదే బెదిరింపులు వస్తుండటం గమనార్హం. మొత్తం  మీద ఈసంవత్సరం బాలీవుడ్‌ను కొంత భయం ఆవరించిందని చెప్పొచ్చు.