Site icon HashtagU Telugu

Raviteja Nani : కొత్త భామ వెంట పడుతున్న హీరోలు..!

After Raviteja Nani Makers Offer To Her

After Raviteja Nani Makers Offer To Her

Raviteja Nani టాలీవుడ్ లో ఎప్పుడూ హీరోయిన్స్ కొరత కనిపిస్తుంది. ప్రతి వారం వచ్చే సినిమాలతో కొందరు పరిచయం అవుతున్నా వారిలో కొందరు స్టార్ క్రేజ్ తెచ్చుకుంటారు.. మరికొందరు ఒకటి రెండు సినిమాలకే ఆగిపోతారు. అయితే కాస్త టాలెంట్ ఉంది అని గుర్తిస్తే చాలు ఆ హీరోయిన్ ని బాగానే ఎంకరేజ్ చేస్తారు. ప్రస్తుతం ఒక హీరోయిన్ ఒక సినిమాలో నటిస్తుండగా మరో సినిమా ఛాన్స్ అందుకుంది.

మాస్ మహరాజ్ రవితేజ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది భాగ్యశ్రీ బోర్స్. బాలీవుడ్ లో యారియాన్ 2 తో తెరంగేట్రం చేసిన అమ్మడు ఆ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. తెలుగులో రవితేజ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న అమ్మడు ఆ సినిమా రిలీజ్ కాకుండానే మరో క్రెజీ ఛాన్స్ అందుకుంది.

రవితేజ సినిమా పూర్తి కాకుండానే నాని సినిమాలో అవకాశం దక్కించుకుందట భాగ్యశ్రీ. నాని, సుజిత్ కాంబోలో వస్తున్న సినిమాలో అమ్మడు ఓకే అయినట్టు టాక్. రవితేజతో ఎంట్రీ అంటేనే సూపర్ క్రేజ్ దక్కించుకోగా ఇప్పుడు నాని సరసన ఛాన్స్ అంటే భాగ్య శ్రీ లక్కీ అనేస్తున్నారు.

ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయితే మాత్రం తెలుగు తెర మీద కొత్త ధృవతారగా భాగ్య శ్రీ స్టార్ క్రేజ్ దక్కించుకునే ఛాన్స్ ఉంటుంది. రవితేజ సినిమాతో ఎంట్రీ ఇచ్చి స్టార్స్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. సో భాగ్య శ్రీ వారిలో ఒకరిగా ఇక్కడ టాప్ ప్లేస్ కి వెళ్తుందా లేదా అన్నది చూడాలి.

Also Read : Rakul Preet Singh : రకుల్ ప్లానింగ్ అదిరింది.. జిమ్ తర్వాత ఇప్పుడు మరో బిజినెస్ స్టార్ట్..!