మన పొరుగుదేశం బంగ్లాదేశ్ లో చివరిసారిగా హిందీ మూవీ ఎప్పుడు రిలీజ్ అయ్యిందో తెలుసా ? 1971 సంవత్సరంలో !! ఇప్పుడు మళ్ళీ 52 ఏళ్ల తర్వాత అక్కడ ఒక హిందీ మూవీ రిలీజ్ (Pathaan release Bangladesh) అయ్యేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఆ మూవీ మరేదో కాదు.. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ “పఠాన్” (Pathaan release Bangladesh). ఈ ఏడాది స్టార్టింగ్ లో రిలీజ్ అయినా ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల కలెక్షన్స్ చేసింది. లేట్ గా అయినా .. లేటెస్ట్ గా మే 12న బంగ్లాదేశ్ లో “పఠాన్” హిందీ మూవీ విడుదల కానుంది. బంగ్లాదేశ్ ఫిల్మ్ అసోసియేషన్ ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసింది. 52 ఏళ్ళ గ్యాప్ తర్వాత హిందీ మూవీ రిలీజ్ అవుతుండటం .. అక్కడి హిందీ లవర్స్ కు పెద్ద శుభవార్తే.
ALSO READ : Mohammad Shahabuddin: బంగ్లాదేశ్ కొత్త అధ్యక్షుడిగా మహమ్మద్ షహబుద్దీన్.. ఎవరీ మహ్మద్ షహబుద్దీన్..?
1971 నుంచి ఇప్పటిదాకా..
బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అక్కడి లోకల్ మూవీ ఇండస్ట్రీని రక్షించే ప్రయత్నంలో భాగంగా ఇండియా సినిమాలను బ్యాన్ చేశారు. అయినా అక్కడి మూవీ ఇండస్ట్రీ పెద్దగా డెవలప్ కాలేకపోయింది. సినిమా హాళ్ల సంఖ్య కూడా గత కొన్నేళ్లలో బంగ్లాదేశ్ లో బాగా తగ్గిపోయింది. ఆర్థిక సంక్షోభంతో చాలా సినిమా హాళ్లు మూతపడ్డాయి. ఎంతోమంది ఉపాధిని కోల్పోయారు. ఈనేపథ్యంలో సినిమా ఇండస్ట్రీకి లిఫ్ట్ ఇవ్వాలంటే.. ఇండియా సినిమాలకు తలుపులు తెరవడం ఒక్కటే మార్గమని బంగ్లాదేశ్ ప్రభుత్వం గ్రహించింది. అక్కడి ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో 40 ఏళ్ళ తర్వాత.. 2010లోనే బంగ్లా దేశ్ లో ఇండియా మూవీస్ పై బ్యాన్ ఎత్తేశారు. కానీ మళ్ళీ బంగ్లాదేశ్ లోకల్ మూవీ ఇండస్ట్రీ లోని ఒక వర్గం ఆందోళనలు ప్రారంభించింది. దీంతో ఒత్తిడికి గురైన అక్కడి ప్రభుత్వం మళ్ళీ ఇండియా మూవీస్ పై బ్యాన్ విధించింది. అయితే తాజాగా 2023 ప్రారంభంలో ఇండియా మూవీ స్ ను ఇంపోర్ట్ చేసుకొని సినిమా థియేటర్లలో రిలీజ్ చేసుకునేందుకు బంగ్లా సర్కారు అనుమతులు ఇచ్చింది. ఈనేపథ్యంలోనే అక్కడ “పఠాన్”మూవీ రిలీజ్ అవుతోంది.