Site icon HashtagU Telugu

Big B-Rajinikanth: 32 ఏళ్ల ఆ తర్వాత ఆ ఇద్దరూ కలిశారు!

Big Be And Rajani

Big Be And Rajani

Big B-Rajinikanth: భారతీయ సినిమా లెజెండ్ అమితాబ్ బచ్చన్ రజనీకాంత్ రాబోయే చిత్రం ‘తలైవర్ 170’ సినిమాలో కలిసి నటించబోతున్నారు. తలైవర్ 170లోని నటీనటులకు “షాహెన్‌షా ఆఫ్ ఇండియన్ సినిమా” అమితాబ్ బచ్చన్‌ను లైకా ప్రొడక్షన్స్ సాదరంగా స్వాగతించింది. ప్రొడక్షన్ హౌస్ ట్వీట్ చేస్తూ “భారత సినిమా షాహెన్‌షాకు స్వాగతం. అత్యున్నత ప్రతిభ బచ్చన్ కే సొంతం అంటూ స్పందించింది.

రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ చివరిగా 1991లో ఫ్యామిలీ డ్రామా “హమ్”లో స్క్రీన్‌ను పంచుకున్నారు. 32 సంవత్సరాల తర్వాత మళ్లీ కలిసి నటించబోతున్నారు. అయితే వారు కలిసి పనిచేయనప్పటికీ, అమితాబ్ రజనీ నటకు ఫిదా అవుతూ వస్తున్నాడు. అమితాబ్ కోడలు ఐశ్వర్య రాయ్ నటించిన “రోబో” ప్రమోషన్స్ లో బచ్చన్ పాల్గొన్నాడు. బాలీవుడ్ లో రోబోకు ప్రమోషన్స్ చేశాడు.

ప్రస్తుతానికి పేరు పెట్టని ఈ చిత్రం మార్చిలో అధికారికంగా ప్రకటించబడింది. “జై భీమ్” చిత్రానికి పనిచేసినందుకు ప్రసిద్ధి చెందిన టిజె జ్ఞానవేల్ దీనికి దర్శకత్వం వహించనున్నారు. నేను నా 170వ చిత్రాన్ని దర్శకుడు జ్ఞానవేల్ మరియు లైకాతో కలిసి చేస్తున్నారు.  రజనీకాంత్ ఇటీవల నెల్సన్ దర్శకత్వం వహించిన “జైలర్” సూపర్ హిట్ అయ్యింది. విజయవంతమైన బాక్సాఫీస్ రన్ చేసింది. ఇక అమితాబ్ కూడా పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. చాలా రోజుల తర్వాత ఈ సూపర్ స్టార్స్ కలిసి నటిస్తుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Also Read: KTR: నిర్మల్ జిల్లాలో కేటీఆర్ పర్యటన

Exit mobile version