Site icon HashtagU Telugu

Trisha Romance With Vijay: 14 ఏళ్ల తర్వాత హిట్ పెయిర్ రిపీట్.. విజయ్ తో త్రిష రొమాన్స్!

Trisha

Trisha

హిట్ కాంబినేషన్స్ మాత్రమే కాదు.. హిట్ పెయిర్స్ (Hit Pair) కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతాయి. పలాన హీరో పక్క, అలాంటి హీరోయిన్ మాత్రమే నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ తోపాటు ప్రేక్షకులు కోరుకుంటుంటారు. అయితే ఒకసారి హిట్ పెయిర్ మాయ చేస్తే, మళ్లీ మళ్లీ చూడాలనుకుంటారు. అలాంటి హిట్ కాంబినేషన్స్ లో త్రిష (Trisha), విజయ్ (Vijay Thalapathy) జంట ముందు వరుసలో ఉంటుంది.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో దళపతి విజయ్ 67వ చిత్రం మూవీ ఫిక్స్ అయ్యింది. భారీ స్టార్ కాస్ట్ (Star Cost) తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్ లాంటి స్టార్స్ భాగమవుతున్న ఈ మూవీలో పొన్నియిన్ సెల్వన్ ఫేమ్ త్రిష కృష్ణన్ (Trisha) ఈ మూవీలో నటించబోతోంది. విజయ్ సరసన త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుంది. విజయ్‌తో త్రిషకు ఇది ఐదవ సినిమా. మ్యాజికల్ పెయిర్ 14 ఏళ్ల తర్వాత కలిసి పని చేయనున్నారు. 7 స్క్రీన్ స్టూడియో పతాకంపై ఎస్ ఎస్ లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

భారీ స్టార్ కాస్ట్

ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం (Music) అందిస్తుండగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిషన్, ఎన్. సతీస్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్. రామ్‌కుమార్ బాలసుబ్రమణియన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ‘దళపతి 67’ నటీనటులు, సిబ్బందికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి. అయితే మేకింగ్ పై మంచి పట్టున్న లోకేష్ ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. విజయ్, త్రిష (Trisha) పై అందమైన పాటలు, ద్రుశ్యాలను తెరకెక్కించబోతున్నాడు. విజయ్-లోకేష్ కాంబినేషన్ లో మాస్టర్ మూవీ మంచి హిట్ సాధించిన విషయం తెలిసిందే.

Also Read: Balakrishna Unstoppable: బాలయ్య బిజీ బిజీ.. అన్‌స్టాపబుల్ కు గుడ్ బై!