Site icon HashtagU Telugu

Mooments of G2 : గూఢచారి 2 మూమెంట్స్ అదిరిపోయాయ్..!

Adivi Sesh Sharing Mooments Of G2 In Social Media

Adivi Sesh Sharing Mooments Of G2 In Social Media

Mooments of G2 యువ హీరో అడివి శేష్ సూపర్ హిట్ సినిమా గూఢచారి సీక్వెల్ ప్లానింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమా గురించి అంచనాలు పెంచేలా మూమెంట్ ఆఫ్ గూఢచారి 2 (Goodhachari 2) అంటూ అడివి శేష్ తన సోషల్ మీడియాలో జి2 ఫోటోలు షేర్ చేశాడు. గూఢచారి సినిమా సీక్వెల్ గా జి2 ఎప్పుడో అనౌన్స్ చేసినా సినిమా షూటింగ్ లేట్ అవుతూ వస్తుంది. వినయ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న గూఢచారి సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకె ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్నారు.

గూఢచారి సినిమా పర్ఫెక్ట్ తెలుగు స్పై థ్రిల్లర్ గా ప్రేక్షకుల చేత సూపర్ అనిపించుకుంది. ఐతే ఆ సినిమా సీక్వెల్ పై కూడా ఆడియన్స్ భారీ అంచనాలతో ఉన్నారు. అడివి శేష్ (Adivi Sesh) సినిమాలు అంటే ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంటుంది. తెలుగు సినిమాలకు ఒక మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్, కొత్త స్టోరీ టెల్లింగ్ అందిస్తున్న శేష్ యువ హీరోల్లో సత్తా చాటుతూ దూసుకెళ్తున్నాడు.

Also Read : Megastar Chiranjeevi : వాటి దారుల్లోనే మెగా విశ్వంభర కూడానా..?

గూఢచరి 2 సినిమాకు సంబందించి అడివి శేష్ షేర్ చేసిన మూమెంట్స్ ఆఫ్ జి2 ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమా యాక్షన్ ప్రియులకు మంచి ట్రీట్ అందించేలా ఉంది. ఫోటోలతోనే సూపర్ ట్రీట్ అందిస్తున్న అడివి శేష్ సినిమాతో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంటాడని అంటున్నారు.

ఈ సినిమాతో పాటుగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో డెకాయిట్ సినిమా చేస్తున్నాడు అడివి శేష్. ఐతే సినిమాలు సెట్స్ మీద ఉండగా రిలీజ్ వరకు సైలెన్స్ మెయింటైన్ చేయక తప్పదు. అప్పుడప్పుడు ఇలా ప్రమోషనల్ కంటెంట్ తో అడివి శేష్ ఆడియన్స్ ని అలర్ట్ చేస్తున్నాడు.