Site icon HashtagU Telugu

Adivi Sesh: టాలీవుడ్ హీరోలపై అడివి శేష్ సంచలన కామెంట్స్

Adivi

Adivi

టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ (Adivi Sesh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ (Tollywood) లో ప్రతి కుటుంబం నుండి కనీసం 10 మంది హీరోలు ఉన్నారని, కొత్త వ్యక్తులు అవకాశాలు పొందడం చాలా కష్టమని కామెంట్స్ చేశారు. సినిమాలోని లీడ్ రోల్స్‌తో పాటు ఇంపార్టెంట్ రోల్స్ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోతాయని.. కనీస ప్రాముఖ్యత లేని పాత్రలకు మాత్రమే ఇక్కడ ఆడిషన్స్ ఉంటాయని అడివి శేష్ (Adivi Sesh) తెలిపారు. కాబట్టి లీడ్ రోల్స్ దక్కాలంటే సొంతంగా కథలు రాసుకోవడమే ఏకైక ఆప్షన్ అన్నారు.

అయితే తనకే అన్నీ తెలుసని అనుకోనని.. కాకపోతే ఫెయిలైతే ఎందుకలా జరిగిందో తెలుసుకుంటానని చెప్పారు. ఒక్క టాలీవుడ్ లో వివక్ష ఉందని అడివి శేష్ అన్నారు. హిట్స్, ఫెయిల్యూర్స్ ను సమానంగా తీసుకుంటానని శేష్ (Adivi Sesh) చెప్పారు. ఏదైనా సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిస్తే, తాను డిప్రెషన్‌కు గురికానని చెప్పాడు. ఫలితం గురించి ఆచరణాత్మకంగా ఉన్నానని అన్నారు.

తన విజయాలకు కారణం తాను ఎంచుకున్న కథలే అని అని అన్నాడు. ఇక తాను నటించిన ఆరు సినిమాలలో నాలుగు సినిమాలకు తానే స్క్రిప్ట్ రాసుకున్నానని గుర్తు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ గురించి ఇక్కడ ఉన్నటువంటి హీరోల గురించి (Adivi Sesh)చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: Allu Arjun Sankranti Treat: పుష్ప ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సంక్రాంతికి ‘బన్నీ’ స్పెషల్ సర్ ప్రైజ్!