Adipurush : వెనక్కు తగ్గిన ఆదిపురుష్ చిత్రయూనిట్.. డైలాగ్స్ మారుస్తాం అంటూ ప్రకటన..

ఈ సినిమాలో వాడిన కొన్ని డైలాగ్స్ అయితే వివాదం సృష్టించాయి. నార్త్ లో అయితే దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. సినిమా దర్శకుడు ఓం రౌత్, రచయిత మనోజ్ వీటిని సమర్థిస్తూ మాట్లాడటంతో ఈ వివాదం మరింత పెద్దదైంది.

  • Written By:
  • Publish Date - June 18, 2023 / 06:56 PM IST

ప్రభాస్(Prabhas) రాముడిగా, కృతి సనన్(Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్(Saif Alikhan) రావణాసురుడిగా రామాయణం ఆధారంగా ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో వచ్చిన ఆదిపురుష్(Adipurush) సినిమా ఇటీవల రిలీజైన సంగతి తెలిసిందే. కలెక్షన్స్ పక్కన పెడితే సినిమాపై పూర్తిగా నెగిటివ్ టాక్ వచ్చింది. అసలు ఇది రామాయణం కాదని, పాత్రల స్వరూపాలు కూడా మార్చేశారని రకరకాలుగా అభిమానులు, నెటిజన్లు, ప్రేక్షకులు ఆదిపురుష్ చిత్రయూనిట్ పై విమర్శలు, ట్రోల్స్ చేశారు. ఇక ఈ సినిమాలో వాడిన కొన్ని డైలాగ్స్ అయితే వివాదం సృష్టించాయి. నార్త్ లో అయితే దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది.

సినిమా దర్శకుడు ఓం రౌత్, రచయిత మనోజ్ వీటిని సమర్థిస్తూ మాట్లాడటంతో ఈ వివాదం మరింత పెద్దదైంది. సోషల్ మీడియా వేదికగా ఈ ఇద్దరిపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో చిత్రయూనిట్ వెనక్కి తగ్గి.. ప్రేక్షకుల సెంటిమెంట్స్ కంటే మాకు ఏది ఎక్కువ కాదు, డైలాగ్స్ మారుస్తాము. మార్చిన వర్షన్ ఈ వారంలోపే థియేటర్స్ లోకి వస్తుంది అని అధికారికంగా ట్వీట్ చేశారు.

ఇక దీనిపై రచయిత మనోజ్ ఇప్పటికి కూడా తప్పుచేశాము అని ఒప్పుకోకుండా మీరు అడిగారు కాబట్టి మారుస్తున్నాము అంటూ ట్వీట్ చేశాడు. తన ట్వీట్ లో.. ఆదిపురుష్ సినిమాలో నేను 4000 లైన్ల మాటలు రాశాను. కానీ మీకు ఆ అయిదు లైన్లే కనపడ్డాయి. మిగిలిన వాటికి మాత్రం ప్రశంసలు ఇవ్వలేదు. మీరు తొందరపడి నా మీద విమర్శలు చేశారు. నా సొంతవాళ్లే నన్ను విమర్శలు చేశారు. నా డైలాగ్స్ కరెక్ట్ అని నేను సమర్ధిచుకుంటూ వాదన చేయగలను. కానీ దాంతో మీ బాధ తగ్గదు, అందుకే డైలాగ్స్ మారుస్తున్నాము అని తెలిపాడు. ఇక మనోజ్ మొదట ఇది రామాయణం సినిమా అని, ట్రోల్స్ వచ్చాక అసలు ఇది రామాయణం కాదని, ఇప్పుడు మళ్ళీ రామాయణంలో డైలాగ్స్ మారుస్తామని.. ఇలా రోజుకొక మాట మాట్లాడుతుండటంతో దేశవ్యాప్తంగా మనోజ్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

 

Adipurush Controversy: ‘ఆదిపురుష్’ పూర్తి రామాయణం కాదు: ఓం రౌత్