Adipurush Second Song: నువ్వు రాజకుమారివి జానకి.. నువ్వు ఉండాల్సింది రాజభవనంలో!

కొద్దిసేపటి క్రితమే ఆదిపురుష్ మేకర్స్ రెండో సాంగ్ ను రిలీజ్ చేశారు. రాముడి, సీత మధ్య ఉన్న పవిత్ర బంధాన్ని తెలియజేస్తుంది.

Published By: HashtagU Telugu Desk
Adipuruth

Adipuruth

పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన మూవీ ఆదిపురుష్ విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో మూవీ టీం ప్రమోషన్ల స్సీడ్ పెంచింది. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ నుంచి రెండో పాటను విడుదల చేశారు. ‘రాం సియా రాం’ అనే పాట సీతాదేవికి రామునిపై ఉన్న ఎనలేని ప్రేమను తెలియజేస్తోంది. ఈ పాట అందమైన స్వరాలతో మొదలవుతుంది. సీతారాముల పవిత్ర బంధం గురించి వర్ణిస్తుంది.

‘నువ్వు రాజకుమారివి జానకి.. నువ్వు ఉండాల్సింది రాజభవనంలో’ అని సీత పాత్రధారి కృతీ సనన్‌కు ప్రభాస్ చెబితే.. ‘నా రాఘవ ఎక్కడుంటే అదే నా రాజమందిరం.. మీ నీడైనా మిమ్మల్ని వదిలివెళ్తుందేమో.. ఈ జానకి వెళ్లదు’ అని ఆమె బదులిస్తుంది. ‘ఆదియు అంతము రాముడిలోనే.. మా అనుబంధం రాముడితోనే’ అంటూ మొదలైన పాటలో రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం, మంచి విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

లిరికల్ వీడియోలో అద్భుతమైన విజువల్స్ కూడా ఉన్నాయి. రాముడు, సీత పాత్రల్లో ప్రభాస్‌, కృతి సనన్‌లు కనిపిస్తారు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ‘ఆదిపురుష్’ సినిమాలో సీతా దేవిగా కృతి సనన్ నటించారు. లక్ష్మణుడి పాత్రను సన్నీ సింగ్, హనుమంతుని పాత్రను దేవదత్తా నాగే పోషించారు. లంకేశుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా త్రీడీలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Tiger Hunt: ఆసిఫాబాద్ జిల్లాలో పులి హల్ చల్.. రెండు బర్రెలు మృతి

  Last Updated: 29 May 2023, 01:14 PM IST