Site icon HashtagU Telugu

Adipurush Update: ఆదిపురుష్ నుంచి మరో అప్డేట్, రాముడి రాక కోసం సీత కంటతడి!

Adipurush

Adipurush

పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas), బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్‌ లో తెరకెక్కుతున్న ఆదిపురుష్ (Adipurush) మూవీ దాదాపు కంప్లీట్ అయ్యింది. దీంతో సినిమా ప్రమోషన్లలో వేగం పెంచింది. ఇప్పటికే ప్రభాస్ లుక్, ఫస్ట్ సింగిల్ ను విడుదల చేసిన టీం, తాజాగా సీత పాత్రను పరిచయం చేస్తూ కొత్త పోస్టర్ విడుదల చేశారు. లంకలో ఉన్న సీత రాముడి రాకకోసం కంటతడితో ఎదురుచూస్తున్నట్లు పోస్టర్ ను వదిలారు.

అమరం, అఖిలం ఈ నామం, సీతారాముల ప్రియనామం అంటూ ‘జై సియా రామ్‌’ ఆడియో టీజర్‌ (Teaser)ను కూడా విడుదల చేసింది. కొత్త పోస్టర్‌లో సీతమ్మగా కృతి సనన్‌ ఆకట్టుకునేలా కనిపించింది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడిగా కనిపించనున్నాడు. టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థలు రూ.500 కోట్లతో ఆదిపురుష్ ను నిర్మించాయి.

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో నటిస్తోన్న సినిమా ఆదిపురుష్ (Adipurush). రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ ఏడాది జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఆదిపురుష్ విడుదల కాబోతోంది. ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్‌ నటి కృతీసనన్‌ సీత పాత్రలో కనిపించనుంది. వీఎఫ్ ఎక్స్ పనులు పూర్తి చేసుకొని విడుదలకు రెడీ అవుతోంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో.. చిత్ర బృందం ప్రమోషన్స్ షురూ చేసింది. కొత్త పోస్టర్లు, టీజర్లు, లిరికల్ వీడియోలతో అంచనాలను పెంచుతోంది.

Also Read: Mahesh AMB: బిజినెస్ లోనూ శ్రీమంతుడు.. బెంగళూరులో AMB థియేటర్!

Exit mobile version